సకాలంలో ఫ్లాట్లను అందించడం లేదని వినియోగదారులను ఆశ్రయించడం మనకు తెలిసిందే. కానీ, గడువులోగా ఇంటీరియర్ పనులను పూర్తి చేయలేదని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుని అనుకూలంగా ఫోరమ్ తీర్పును ఇవ్వటమే కాకుండా సదరు కంపెనీకి రూ.75 వేలు జరిమానా విధించింది.
డిజైన్ ఐ కంపెనీ జాప్యం..
జి. రమేష్ రుణం ద్వారా కోకాపేటలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో ఇంటీరియర్ డిజైన్ కోసం డిజైన్ ఐ అనే సంస్థ ప్రతినిధి సాయికృష్ణా రెడ్డిని సంప్రదించారు. రూ.1.50 లక్షలకు పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రమేష్ రూ.25 వేలు చెక్‌ను అడ్వాన్స్‌గా బయానా కింద ఇచ్చారు. సాయికృష్ణా రెడ్డి అభ్యర్థన మేరకు మరొక రూ.50 వేల చెక్‌ను ఇచ్చారు. డబ్బు సమకూరిందని చెప్పిన తర్వాతే చెక్‌ను డ్రా చేయాలని సాయికృష్ణా రెడ్డిని అభ్యర్థించారు. కానీ, సాయికృష్ణా వినిపించుకోకుండా చెక్‌ను డ్రా చేయడంతో అది బౌన్స్ అయింది. దీంతో వెంటనే సురేష్ ఆన్లైన్ ద్వారా రూ.50 వేల నగదును బదిలీ చేశారు. సకాలంలో డబ్బులు చెల్లించినా సరే పనులు పూర్తి చేయకపోవటమే కాకుండా, మిగిలిన పూర్తి సొమ్ములను ఇవ్వకపోతే చెక్ బౌన్స్ కేసు వేస్తానని సాయికృష్ణా రెడ్డి బెదిరించారు. దీంతో వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు సురేశ్. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వటంతో పాటూ జాప్యం చేసినందుకు తగిన న్యాయం చేయాలని తగిన ఆధారాలను ఫోరానికి సమర్పించారు.
రూ.75 వేలు జరిమానా..
ఒప్పందం ప్రకారం ఇంటీరియర్ డిజైనింగ్ చేయడంలో జాప్యం చేసినందుకు హైదరాబాద్ వినియోగదారుల ఫోరమ్–2 డిజైన్ ఐ అనే సంస్థకు రూ.75 వేలు జరిమానా విధించింది. మానసిక వేదిన చెందిన ఫిర్యాదుదారునికి ఈ మొత్తం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీంతో పాటూ ఫిర్యాదుదారు చెల్లించిన మొత్తం, కట్టిన అద్దె రూ.53,200 ఇతర ఖర్చుల కింద రూ.10 వేలు కూడా చెల్లించాలని సూచించింది.