Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

డెకోలన్‌ ఎస్‌ఏ కంపెనీని కొనుగోలు చేసిన గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌

డెకొరేటివ్‌ సర్‌ఫేసింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ గ్రీన్‌లామ్‌ యూరప్‌కు చెందిన డెకోలన్‌ ఎస్‌ఏ కంపెనీని కొనుగోలు చేసింది. యూరప్‌లో డెకొరేటివ్‌ వీనర్స్, డోర్స్, ఇంజనీర్డ్‌ ఉడెన్‌ ఫ్లోరింగ్‌ వంటి ఉత్పత్తుల సప్లయర్‌ కంపెనీ ఈ డెకోలన్‌ ఎస్‌ఏ. కొనుగోలు ప్రక్రియ ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి పూర్తవుతుందని గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ సీఈఓ, ఎండీ సౌరభ్‌ మిట్టల్‌ తెలిపారు. డెకొలన్‌ ఎస్‌ఏ కొనుగోలుతో గ్రీన్‌లామ్‌కు యూరప్‌లో వ్యాపార విస్తరణ సులువవుతుందని, ఉత్పత్తుల శ్రేణి కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వందకు పైగా దేశాల్లో గ్లోబల్‌ బ్రాండ్‌గా సేవలందిస్తుంది గ్రీన్‌లామ్‌.

Related Posts

Latest News Updates