Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

తెలంగాణలో 6 లక్షల ఎకరాల అటవీ భూముల ఆక్రమణ

తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్‌ భూములు ఆక్రమణకు గురయ్యాయి. సుమారు 6 లక్షల ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయని సర్వేలో తేలింది. 6 లక్షల ఎకరాలు అంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ భౌగోళిక ప్రాంతాని కంటే మూడు రెట్లు సమానమైందన్నమాట.
ఆక్రమణకు కారణాలెన్నో..
పలు ప్రాంతాల్లో గ్రామీణులు ఈ భూములు తమవని ఆరోపించడం, సరిహద్దు భూముల్లో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం, చాలా చోట్ల సర్వే నంబర్లు కనిపించకపోవటం ఈ ఆక్రమణలకు కారణమని సర్వేలో తేలింది. కొన్ని చోట్ల ప్రభుత్వం అటవీ శాఖకు చెందిన భూములను లబ్దిదారులకు కేటాయించింది. వీటిల్లో చాలా వాటికి సరైన రికార్డులు లేకపోవటం గమనార్హం.
రాష్ట్రంలో 66.67 లక్షల అటవీ భూములు..
తెలంగాణ రాష్ట్రంలో 4563 రెవిన్యూ గ్రామాల్లో సుమారు 66.67 లక్షల ఎకరాల అటవీ భూములున్నట్లు గుర్తించారు. వీటిల్లో అటవీ, రెవిన్యూ శాఖలు 53.89 లక్షల ఎకరాల భూమిని సర్వే చేసినట్లు సమాచారం. వీటిలో 47.44 లక్షల ఎకరాల భూములకు క్లియర్‌ యాజమాన్య వివరాలున్నాయి. మిగిలిన 12 లక్షల ఎకరాల అటవీ భూముల సర్వే కూడా పూర్తయితే ఎంత భూమి అన్యాక్రాంతమైందన్న విషయం మీద స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Related Posts

Latest News Updates