Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణలో 676; ఏపీలో 40

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం (రెరా) అమలై రెండేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెరా నిబంధనలు నోటిఫై చేశాయి. వీటిల్లో 20 రాష్ట్రాల్లో మాత్రం రెరా వెబ్‌సైట్‌ అమలులో ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 41 వేల ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదయ్యాయయని ప్రాప్‌స్టాక్‌ నివేదిక తెలిపింది.
తెలంగాణలో 676 ప్రాజెక్ట్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో 40 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి. ఇతర రాష్ట్రాల వివరాలను పరిశీలిస్తే.. అత్యధికంగా మహారాష్ట్రలో 20,560 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. అత్యల్పంగా అండమాన్‌ అండ్‌ నికోబర్‌లో ఒక్క ప్రాజెక్ట్, దామన్‌ అండ్‌ డ్యూలో 18 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి. కర్నాటకలో 3157, ఢిల్లీలో 13, తమిళనాడులో 978, పంజాబ్‌లో 672, హిమాచల్‌ ప్రదేశ్‌లో 29, ఉత్తరాఖండ్‌లో 156, ఉత్తర ప్రదేశ్‌లో 2612, బీహార్‌లో 1073, పశ్చిమ బెంగాల్‌లో 403, ఒడిశాలో 257, చత్తీస్‌ఘడ్‌లో 980, గోవాలో 530, దాద్రా అండ్‌ నగర్‌ హవేలీలో 79, మధ్యప్రదేశ్‌లో 2176, గుజరాత్‌లో 5360, రాజస్థాన్‌లో 961, హర్యానా–గుర్గావ్‌లో 301, హర్యానా– పంచకులాలో 257 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.

Related Posts

Latest News Updates