Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

త్రివిక్రమ్‌ థియేటర్‌ ఓనరయ్యాడు!

ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఒక థియేటర్‌ ఓనరయ్యాడు. తూర్పు గోదావరిలోని రాజనగరంలో రాయుడు సినీమ్యాక్స్‌ థియేటర్‌ను త్రివిక్రమ్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. అరవింద సమేత డైరెక్టర్‌ అయిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రాయుడు థియేటర్, దాని రెనోవేషన్‌ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పలు ప్రాంతాల్లో ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. ఒక్క సినీ దర్శకత్వానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటాడని సమాచారం.

రియల్టీలో సినీ ఆర్టిస్ట్‌లు..
ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో వినాయక్, తేజ వంటి ప్రముఖులకు కూడా సొంతంగా థియేటర్లు ఉన్న విషయం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు గచ్చిబౌలిలో 7 స్క్రీన్ల ఏషియన్‌ మహేశ్‌బాబు సినిమాస్‌ (ఎఎంబీ) మాల్‌ ఉంది. దీన్ని ఏషియన్‌ గ్రూప్‌తో కలిసి నిర్వహిస్తున్నారు. అక్కినేని నాగార్జునకు ఎన్‌–గ్రిల్స్‌ రెస్టారెంట్స్, ఎన్‌–కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంది.

Related Posts

Latest News Updates