Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

దేశంలో ప్రతి ఒక్కరికీ సొంతిల్లు!

అందరికీ ఇళ్లు దిశగా నరేంద్ర మోదీ 2.ఓ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. అందుబాటు గృహాలను (అఫడబుల్‌ హౌజింగ్‌) దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించారు. అఫడబుల్‌ హౌజింగ్‌లకు అదనపు వడ్డీ రాయితీలు, ప్రభుత్వ స్థలాల కేటాయింపులు, నిర్మాణ గడువు కుదింపు వంటివన్నీ ఈ విభాగాన్ని బలోపేతం చేయనున్నాయి.
ఆర్ధికాభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి అత్యంత కీలకం. మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా. దీన్నే ఫోకస్‌ చేస్తూ నిర్మలా సీతారామన్‌ తొలి బడ్జెట్‌ను రూపొందించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్మాణ రంగానికి ప్రయోజనాలు కలుగుతాయి. అందుబాటు గృహాలకు (అఫడబుల్‌ హౌజింగ్‌) వడ్డీ మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచారు. ఇది తొలిసారి గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. రూ.45 లక్షల లోపు గృహాలను కొనుగోలు చేసే వారికి ఈ వడ్డీ రాయితీ అందుతుంది.
1.95 కోట్ల పీఎంఏవై గృహాలు..
ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) గ్రామీణంలో 2020–22 ఆర్ధిక సంవత్సరంలో లబ్ధిదారులకు 1.95 కోట్ల గృహాలను అందించాలని నిర్ణయించారు. అలాగే గతంలో 2015–16లో పీఎంఏవై కింద ఒక గృహ నిర్మాణానికి 314 రోజుల సమయాన్ని ప్రతిపాదించింది. కానీ, 2017 నుంచి దీన్ని 114 రోజులకు తగ్గించేసింది. అంటే నిర్మాణంలో వేగం పెంచింది. అందుబాటు గృహాల నిర్మాణాల వైపు డెవలపర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ స్థలాలను కేటాయించనున్నారు. జాయింట్‌ డెవలప్‌మెంట్‌ కింద వీటిని నిర్మిస్తారు. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అందుబాటు గృహాల నిర్మాణానికి స్థానిక డెవలపర్లు ముందుకొచ్చే అవకాశముందని క్రెడాయ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్‌ రెడ్డి తెలిపారు.

Related Posts

Latest News Updates