దేశంలో 4.65 లక్షల గృహాలు నిర్మాణ గడువు ముగిసినా సరే నేటికీ పూర్తి కాలేదని (డిలీ) ప్రాప్ఈక్విటీ సర్వే తెలిపింది. వీటి విలువ రూ.3.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో 1.81 లక్షలు (39 శాతం) గృహాలు ఎన్సీఆర్లోనే ఉన్నాయి. వీటి విలువ రూ.1.22 లక్షల కోట్లు. 1.05 గృహాలు ముంబైలో ఉన్నాయి. వీటి విలువ రూ.1.12 లక్షల కోట్లు. నిధుల మళ్లింపు, నియంత్రణ సంస్థలు లేకపోవటం, నిబంధనల అతిక్రమణ, సరఫరా ఎక్కువగా ఉండటం, ఆర్ధిక సంక్షోభం వంటివి గృహాల డిలేకు ప్రధాన కారణమని తెలిపింది.
హైదరాబాద్లో 9600 గృహాలు
నగరాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. దేశంలోని 7 ప్రధాన నగరాలు ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, పుణేలల్లో ప్రతి 10 గృహాల్లో 4 గృహాలు డిలే ప్రాజెక్ట్లుగానే మిగిలిపోతున్నాయి. డిలీ గృహాల్లో 10 శాతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల వాటా ఉంటుంది. ఈ మూడు నగరాల్లోని డిలే గృహాల విలువ రూ.41,770 కోట్లుగా ఉంటాయి. చెన్నైలో 8650 గృహాలు, పుణేలో 86700 గృహాలు, హైదరాబాద్లో 9600 గృహాలు, బెంగళూరులో 40450 గృహాలు డిలేగా ఉన్నాయి.