Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అపర్ణా మాల్స్‌

మెట్రో నగరాలకే పరిమితమైన షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్‌ కాన్సెప్ట్‌లను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విస్తరించింది. అయితే ఈ మాల్స్‌ ప్రధాన నగరాల్లో మాదిరిగా పెద్దగా కాకుండా చిన్నగా (బొటిక్‌) స్థాయిలో ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
శంషాబాద్‌లో ఫస్ట్‌ మాల్‌..
లక్ష చ.అ. లోపే బొటిక్‌ మాల్స్‌ ఉండటం దీని ప్రత్యేకత. త్వరలోనే శంషాబాద్‌లో తొలి బొటిక్‌ మాల్‌ను ప్రారంభించనుంది. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్, తిరుపతి, రాజమండ్రి వంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో నిర్మించనుంది. రాజమండ్రి, వరంగల్‌లో స్థలాల అన్వేషణ పూర్తయింది. అభివృద్ధి పనులను ప్రారంభించాల్సి ఉంది. వచ్చే 3–5 ఏళ్లలో కోటిన్నర చ.అ.ల్లో, సుమారు 6–10 బొటిక్‌ మాల్స్‌ను నిర్మించాలని లక్ష్యించింది. అన్ని బొటిక్‌ మాల్స్‌లో కలిపి 60–100 స్క్రీన్స్‌ అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ప్రస్తుతం నల్లగండ్లలోని అపర్ణా సరోవర్‌ జెనిత్‌ ప్రాజెక్ట్‌ ప్రాంతంలో 3.5 లక్షల చ.అ. రిటైల్‌ మాల్‌ను నిర్మిస్తున్నాం. అపర్ణా నుంచి తొలి మాల్‌ ఇదే.

ఫ్యామిలీతో ఎంజాయ్‌..
నగరం, పట్టణం అనే తేడా లేకుండా వీకెండ్‌ వచ్చిందంటే చాలు కుటుంబంతో కలిసి సరదాగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణవాసులకు కూడా షాపింగ్‌ మాల్స్‌ అనుభూతిని కల్పించాలనే ఉద్దేశంతో బొటిక్‌ తరహా మాల్స్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్‌ సి. రాకేశ్‌ రెడ్డి తెలిపారు. ఒకే చోట ఫుడ్‌ కోర్ట్, మల్టీప్లెక్స్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్, కిడ్స్‌ ప్లేజోన్‌ వంటి అన్ని రకాల వసతులుంటాయి.

Related Posts

Latest News Updates