బెంగళూరుకు చెందిన హోమ్ రెంటల్ స్టార్టప్ నెస్ట్ అవే నుంచి దీని కో–ఫౌండర్ దీపక్ ధార్ బయటకి వెళ్లనున్నారు. కొత్తగా ఫిన్‌టెక్ స్టార్టప్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. సిట్రస్ మేమెంట్ ఎగ్జిక్యూటివ్‌తో కలిసి ఈ వెంచర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.
40 వేల మంది..
2015 జనవరిలో అమరేంద్ర సాహు, స్మ్రుతి పరీదా, దీపక్ ధార్, జితేంద్ర జగదేవ్ నలుగురు కలిసి నెస్ట్ అవేను ప్రారంభించారు. ప్రస్తుతం నెస్ట్ అవే బెంగళూరు, ఢిల్లీ, ఫరీదాబాద్, నోయిడా, గుర్గావ్, హైదరాబాద్, ముంబై, పుణే నగరాల్లో సేవలందిస్తుంది. సుమారు 40 వేల మంది అద్దెదారులున్నారు. నెలకు 2 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది.