దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని నెహ్రు అధికారిక నివాసంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మ్యూజియం నిర్మితం కానుంది. నెహ్రు మోమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్)కు నిలయమైన తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్‌లో మోదీ మ్యూజియం రూపకల్పన జరగనుంది. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తయ్యాయి కూడా!
నిర్మాణ సంస్థలివే..
మోడీ మ్యూజియం అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వం ఏడు సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసింది. వీటిల్లో హైదరాబాద్ నుంచి విజువల్ క్వెస్ట్ ఇండియా ఒకటి కాగా.. మిగిలినవి లండన్‌కు చెందిన మ్యూజియం అండ్ ఎక్స్పో ఇంటర్నేషనల్ (ఎంయూఎస్‌ఈ), జర్మనీకి చెందిన ఆటిల్లర్ బ్రూక్నర్, ఆర్చోమ్, స్టూడియో ఎంబీ, డిజైన్ మ్యాట్రిక్స్ యూకే, ఢిల్లీకి చెందిన ఎక్స్ప్రెషన్స్ యాడ్ ఏజెన్సీ, భువనేశ్వర్‌కు చెందిన ఆర్కిటిక్నో కన్సల్టెంట్ ఇండియా, బెంగళూరుకు చెందిన ఎఫ్ఐ డిజైన్ ఉన్నాయి.
2020 అక్టోబర్ నుంచి సందర్శన
ఆయా కంపెనీలు డిజైన్స్ ప్రతిపాదనలను అందించిందని, ఎన్ఎంఎంఎల్ వీటిని పరిశీలిస్తోందని, ఈ నెలాఖరు నాటికి డిజైన్స్ ఎంపిక పూర్తవుతుందని ఓ అధికారి తెలిపారు. 10 వేల చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణం జరుగుతుంది. 2020 అక్టోబర్ నాటికి మ్యూజియం సందర్శన ప్రారంభమవుతుందని తెలిసింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) పనుల పురోగతిని నిశితంగా పరిశీలిస్తోంది.
మ్యూజియం ఎలా ఉంటుందంటే?
నరేంద్ర మోడీ మ్యూజియం వృత్తాకారంగా ఉంటుంది. దేశ స్థిరత్వానికి, అభివృద్ధికి సూచికగా భవనం పైన ధర్మ చక్రం ఉంటుంది. దేశ ప్రధానుల చేతుల్లో ఈ చక్రం ఉంటుంది. భవనంలో రెండు అంతస్తులుంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో స్వతంత్ర సంగ్రామ సంగ్రహాలయం లేదా స్వాతంత్ర పోరాట యోధుల నిలయం ఉంటుంది. రెండో అంతస్తులో వివిధ ప్రధాన మంత్రులు స్వాగత చిత్రాలుంటాయి. లైట్, సౌండ్ షోలు ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ఆంపీ థియేటర్ ఉంటుంది.
226 కోట్ల ప్రాజెక్ట్..
మోదీ మ్యూజియం రూ.226 కోట్ల ప్రాజెక్ట్. డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్, త్రీడీ మ్యాపింగ్ టెక్నాలజీ, టచ్ ఏనేబుల్డ్ డిస్ప్లే, హోల్గ్రామ్స్ వంటివి ఉంటాయి. ఐదేళ్ల పాటు మ్యూజియం నిర్వహణ, ఆపరేషన్స్ కోసం రూ.89 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మ్యూజియంలో ఒరిజనల్ రచనలు, అరుదైన ఫొటోగ్రాఫ్‌లు, స్పీచ్‌లు, వీడియోలు, మైక్రో ఫిల్మ్స్, డిజిటల్ న్యూస్ పేపర్స్, ఇంటర్వ్యూల వంటివి ప్రదర్శిస్తారు. ఎన్ఎంఎంఎల్, ప్రైవేట్ ఏజెన్సీల నుంచి వీటిని సేకరిస్తుంది.