Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నెహ్రూ విధానాల వల్లే కశ్మీర్ సమస్య… మోదీ దానిని చాకచక్యంగా పరిష్కరించారు : అమిత్ షా

నెహ్రూ కశ్మీర్ సమస్యను సృష్టించారని, ఏళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ  దీనిని పరిష్కరించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా  తెలిపారు. ప్రధాని నెహ్రూ ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం  వల్లే…  కశ్మీర్ సమస్య సంక్షోభానికి దారితీసిందని ఆయన ఆరోపించారు. అయితే జటిల సమస్య మూలాలను గ్రహించి ప్రధాని మోదీ  దీనిని తొలిగించివేసి సమస్యను పరిష్కరించారని కితాబు ఇచ్చారు. గుజరాత్ గౌరవ్ యాత్ర మూడవ దశను  గౌరవ్ యాత్రకు పచ్చజెండా ఊపి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  నెహ్రు అనాలోచిత చర్యతోనే కశ్మీర్ కొలిమి అంటుకుందని, ఏళ్ల తరబడి రగులుకుని అక్కడనే కాకుండా జాతీయ స్థాయిలో సంక్షోభానికి దారితీసిందని హోంమంత్రి విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370 వద్దని చెప్పారు. అయితే ఈ దిశలో అన్ని చర్యలు తీసుకుని ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఘనత, కశ్మీర్‌ను దేశంలో పూర్తి స్థాయిలో అనుసంధానం చేసిన ఖ్యాతి ప్రధానికే చెందుతుందని స్పష్టం చేశారు.

 

 

గుజరాత్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపొంది అధికార బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా  విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రజలు చాలా కాలంగా బిజెపిని విశ్వసిస్తున్నారని, వారి కోరికలను పార్టీ నెరవేర్చిందని ఆయన చెప్పారు. బిజెపి సారధ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టేందుకు బిజెపి ఉద్యమించినప్పుడు కాంగ్రెస్ తిట్టి పోసిందని, అయితే తాము దీక్షతో వెళ్లడంతో రామాలయ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు జనానికి ఆకాంక్షలకు అనుగుణమైన రామాలయం ముందుకు రానుందని అమిత్ షా తెలిపారు.  అయోధ్య రామమందిర నిర్మాణం కూడా చిన్న పని కాదని, అయితే అసాధ్యాన్ని బిజెపి సుసాధ్యం చేసిందని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో కర్ఫూలు పరిపాటి అయ్యాయని, అయితే మోదీ  అధికార క్రమంతో ఆ పీడరోజులు పొయ్యాయని ఆయన తెలిపారు.

Related Posts

Latest News Updates