హైటెక్‌సిటీలోని ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసే విజయ్ ఆఫీసుకు వస్తూనే అలా కారు పార్క్‌చేసి లిఫ్ట్‌లో ఎక్కి నాలుగోఫ్లోర్లో ఉన్న తన సెక్షన్‌కు చేరుకున్నాడు. లోపలకు ఎంటర్ అవడంతోనే మొత్తం లైట్లన్నీ వేసి, ఏసీ కూడా ఆన్ చేసి ప్రశాంతంగా సీటులో జారగిలబడ్డాడు.. ఫ్రిజ్‌లో చల్లటి వాటర్ బాటిల్ తాగి రిలాక్స్ అయ్యాడు. కంప్యూటర్ ఆన్‌చేయడంతో దానికి కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్, జిరాక్స్ మెషిన్లు పనిచేయడం ప్రారంభించాయి.
అవసరమున్నా లేకపోయినా కరెంటుని ఇష్టానుసారం వాడే విజయ్ లాంటి వారు ప్రతి ఆఫీస్‌లోనూ ఉంటారు. కేవలం ఉద్యోగులే కాదు.. కొన్ని కొన్ని సంస్థల్లో యజమాన్యాలు కూడా మిరుమిట్లు గొలిపే లైట్ సెట్టింVŠ్సృ, కేఫ్టేరియాలు, పెద్ద వాటర్‌ట్యాంకులు, ఎంటర్టైన్మెంట్ విభాగాల కోసం విద్యుత్తును దృర్వినియోగం చేస్తుంటాయి. దీంతో లక్షల్లో కరెంటు బిల్లు వస్తుంది. చేతి చమురు వదుల్తుంది. ృనవసరంగా కరెంటుని ఖర్చు చేయడం వల్ల పర్యావరణానికి కూడా హాని కల్గుతుంది. ఎందుకంటే ఏసీలు, ఫ్రిజ్‌ల నుంచి పర్యావరణానికి హాని చేసే వాయువులు వెలువడుతాయి. అంతేకాకుండా వారు వాడే అదనపు విద్యుత్ ఉత్పత్తి వల్ల కాలుష్యం మరింతగా పెరుగుతుంది. రాబోయే కాలంలో ప్రపంచం ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇంధనృమే ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రీన్ కాన్సెప్ట్‌తో ఆఫీస్ భవనాల నిర్మాణం చేస్తే అటు విద్యుత్ ఆదా అవుతుంది. ఇటు ఇంధన కొరతను అధిగమించవచ్చు. పర్యావరణానికి మేలు జరుతుంది.
ఇవి పాటిస్తే సరి..
సహజ వెలుతురు ఉండేలా భవననిర్మాణం ఉంటే మంచిది. పాత బిల్డింగ్‌లను సైతం విద్యుత్ ఆదా అయ్యే పద్ధతుల్లో నవీకరించాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ బాటలో ఇప్పటికే అడుగులు వేస్తున్నాయి. కాన్ఫరెన్స్ హాలుల్లో, మీటింగ్స్ జరిగే చోట పనిలేనప్పుడు లైట్లను ఆపివేయాలి. తలుపులను, కిటికీలను బార్లా తెరిచి ఉంచితే గాలి, వెలుతురు బాగా రావడంతోపాటు, ఏసీ అవసరం కూడా తగ్గుతుంది. పనిపూర్తయిన వెంటనే కంప్యూటర్స్ అన్ని షట్‌డౌన్ అయ్యేలా చూడాలి. అదే విధంగా కంప్యూటర్, ప్రింటర్, జిరాక్స్ దేనికదే ప్రత్యేక స్విచ్‌బోర్డ్‌ను కల్గి ఉంటే కరెంటు బిల్లు తక్కువకే పరిమితం అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆఫీసులని నిర్మించేటప్పుడే ఆర్కిటెక్ట్‌లకు కరెంటు వినియోగం తక్కువగా ఉండేలా డిజైన్ చేయమని సూచించడం ద్వారా చాలా వరకు విద్యుత్ ఆదా చేయొచ్చు. ఇటీవల కాలంలో పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఎకో బిల్డింగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. గడ్డిని, కొన్ని రకాల మొక్కలను ఆఫీసు పైకప్పుపై పెంచడం ద్వారా చల్లదనంతోపాటు ఏసీ బిల్లుని తగ్గించుకోవచ్చు. అలాగే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌శక్తికి ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని వాడుకోవచ్చు.
వృథాను గుర్తించండి..
ఆఫీసులో ఏయే విభాగాల్లో ఎక్కడెక్కడ కరెంటు వృథా అవుతుందో సమాచారాన్ని సేకరించేందుకు ఒక అధికారిని లేదా బృందాన్ని నియమించండి. వీటిన్నంటినీ గుర్తించిన తర్వాత వృథా వినియోగాన్ని ఆరికట్టేందుకు చర్యలు మొదలు పెట్టండి. అయితే కరెంటు వినియోగాన్ని తగ్గించే క్రమంలో భాగంగా చేపట్టే ఎలాంటి చర్య ఎవ్వరినీ బాధపెట్టేలా ఉండకుండా జాగ్రత్త పడండి. ఏసీ నీకు అవసరమా? లాంటి ప్రశ్నలతో ఉద్యోగుల మనోభావాలను గాయపర్చకండి. అనవసరంగా లైట్లను వేయడం, చల్లదనం కోసం ఏసీ ఆన్ చేయడం.. ఆఫీసుల్లో ప్రధానంగా విద్యుత్ దుర్వినియోగం ఇలానే జరుగుతుంది. వీకెండ్స్‌లో ఉద్యోగుల హజరు తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఏసీలకు స్వస్తి చెప్పటం ద్వారా కరెంటు ఆదా చేయొచ్చు. లీకేజీలు ఉంటే పరిశీలించడం ద్వారా చల్లదనాన్ని బయటకు పోకుండా చూడడంతోపాటు ఏసీకి అధిక కరెంటు ఖర్చు కాకుండా చూసుకోవచ్చు. మామూలు బల్బులతో పోలిస్తే ప్లోరోసెంట్ బల్బులు 5 శాతం అధిక వెలుతురుని, ఎనిమిది శాతం ఎక్కువ జీవితకాలాన్ని కల్గి ఉంటాయి.