భారతదేశ వ్యాప్తంగా జియో సృష్టించిన డిజిటల్ విప్లవం వల్ల డాటా యొక్క శక్తిని ప్రతి ఒక్క పౌరుడు పొందగలిగారు. సమగ్రమైన మొబైల్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిబడిన నేపథ్యంలో ఈ డిజిటల్ విప్లవం రాష్ట్ర ప్రజానికానికి మరింత చేరువైంది. తాజాగా జతకూడిన మొబైల్ టవర్ల వల్ల, ఆంధ్రప్రదేశ్ లో 10,000 టవర్ల కీలక మైలురాయిని జియో చేరుకుంది. దీంతో నెట్వర్క్ పరంగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.
13.07 మిలియన్స్ చందాదారులు..
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జియోకు 13.07 మిలియన్ల మంది చందాదారులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా అనేక మంది చందాదారులను తన ఖాతాలో జమ చేసుకుంటూ శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జియో వినియోగదారులు సైతం జియో యొక్క డిజిటల్ లైఫ్ సేవలను వేగంగా అందిపుచ్చుకున్నారు.
దేశవ్యాప్తంగా జియో సృష్టించిన డిజిటల్ విప్లవం వల్ల డాటా యొక్క శక్తిని ప్రతి ఒక్క పౌరుడు పొందగలుగుతున్నారు. ఏప్రిల్ 2019 ట్రాయ్ గణాంకాల ప్రకారం, 314.8 మిలియన్ల చందాదారులను జియో కలిగి ఉంది.