దేశంలో ఇసుక మైనింగ్, నిర్మాణ కార్యకలాపాల కోసం పర్యావరణ అనుమతులు (ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్– ఈఐఏ) కోసం సంవత్సరాల కొద్ది వేచి చూసే అవసరం లేదిక. ఎందుకంటే ఇటీవల కేంద్రం ఈఐఏ నిబంధనలను సవరించింది. 20 వేల నుంచి 50 వేల చదరపు మీటర్ల మధ్య జరిగే నిర్మాణ కార్యకలాపాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఈఐఏ అనుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్లు రావటంతో పాటూ అభివృద్ధి జరగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.