Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ @ 28,000 కోట్లు

2019 తొలి ఆర్ధ సంవత్సరం (జనవరి నుంచి జూన్‌) మధ్య కాలంలో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి రూ.28,000 కోట్ల ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. కమర్షియల్, వేర్‌ హౌజ్‌ విభాగంలో ఎక్కువ శాతం ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయని కొల్లియర్స్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక తెలిపింది.
విదేశీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 28 శాతం వృద్ధి..
2019 క్యాలెండర్‌ ఇయర్‌ తొలి ఆరు నెలల కాలంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 28 శాతం వృద్ధి చెందాయని తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని, అందుకే దేశీయ ప్రీమియం ఆఫీస్, రిటైల్, లాజిస్టిక్‌ మార్కెట్స్‌లో పెట్టుబడులు వచ్చాయని కొల్లియర్స్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ నేషనల్‌ డైరెక్టర్‌ సురేష్‌ క్యాస్టెల్లినో తెలిపారు.
ముంబైలో అధికంగా..
మొత్తం పెట్టుబడుల్లో కమర్షియల్‌ విభాగంలోకి 42 శాతం, రిటైల్‌లోకి 31 శాతం పెట్టుబడులు వచ్చాయి. 2019 తొలి అర్ధ సంవత్సరంలో పీఈ పెట్టుబడులు ఎక్కువ ఆకర్షించిన నగరాల జాబితాలో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నగరంలోకి 1.05 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు (మొత్తం పెట్టుబడుల్లో 27 శాతం) వచ్చాయి. పుణేలోకి 237 మిలియన్‌ డాలర్లు వచ్చాయి.

Related Posts

Latest News Updates