Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పీఎంఏవైలో అద్దె గృహాల నిర్మాణం

హౌజింగ్‌ ఫర్‌ ఆల్‌–2022 కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కొత్త విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటివరకు పీఎంఏవై స్కీమ్‌లో సొంతిల్లు కొన్నా లేదా కట్టుకున్నా వడ్డీ రాయితీ లభించేవి. కానీ, ఇక నుంచి గృహాలను అద్దెకు కూడా తీసుకోవచ్చు. పీఎంఏవైలో రెంటల్‌ హౌజింగ్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది.
పట్టణాలు, మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న మురికివాడలను తగ్గించడానికి, సొంతిల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు కల్పించడానికి ఉద్దేశించబడిందే రెంటల్‌ హౌజింగ్‌ ప్లాన్‌. ఈ ప్లాన్‌ కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ, కార్మిక శాఖ రెండు విభాగాల సమన్వయంతో సాగుతుంది.
3 లక్షల లోపు ఆదాయం ఉంటేనే..
రెంటల్‌ హౌజింగ్‌ ప్లాన్‌లో ఏం చేస్తారంటే? ఎల్తైన భవనాల్లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్లను నిర్మిస్తారు. నల్లా, టాయిలెట్‌ వంటి కనీస మౌలిక వసతులను కల్పిస్తారు. ఈ గృహాలను మురికివాడల్లోని పేదలకు, మెట్రో నగరాల్లోని వలస కార్మికులకు అద్దెకు ఇస్తారు. కాకపోతే వీళ్ల వార్షిక ఆదాయం రూ.3 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి సుమీ!
లేబర్‌ సెస్‌తో గృహాల నిర్మాణం..
ఈ గృహాల నిర్మాణం రెండు రకాలుగా చేపడతారు. 1. కార్మిక శాఖ నుంచి లేబర్‌ సెస్‌ను వినియోగించుకొని నిర్మాణాలను చేపట్టడం. 2. ప్రైవేట్‌ సంస్థలు నిర్మించడం. అపార్ట్‌మెంట్ల నిర్మాణ బాధ్యతలను ఆయా రాష్ట్రాల హౌజింగ్‌ బోర్డులకు అప్పగించనుంది. ఒకవేళ ప్రైవేట్‌ పెట్టుబడిదారుల సహకారంతో గృహాలను నిర్మిస్తే.. ప్రాజెక్ట్‌లో కొంత ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు ప్రైవేట్‌ సంస్థలు వినియోగించుకోవచ్చు. ప్రైవేట్‌ కంపెనీలు నిర్మాణాలు చేపట్టినా సరే ఆ గృహాలను అద్దెకు ఇచ్చేది మాత్రం రాష్ట్రాల హౌజింగ్‌ బోర్డులే.

Related Posts

Latest News Updates