Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

పెండింగ్‌లో 4.56 లక్షల పట్టాదారు పాస్‌ పుస్తకాలు

తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన అసంపూర్తిగా మిగిలింది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వివాద రహిత ఖాతాలకు కూడా ఇంకా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు జారీ చేయకపోవటమే అసంపూర్తికి కారణం. తెలంగాణలో 4.56 లక్షల ఖాతాలకు సంబంధించి తహసీల్దార్ల డిజిటల్‌ సంతకాలు కాకపోవడంతో పాస్‌పుస్తకాల జారీ నిలిచిపోయింది.
సెప్టెంబర్‌ తర్వాత కూడా నో మ్యుటేషన్స్‌..
అంతేకాకుండా సెప్టెంబర్‌ తర్వాత జరిగిన భూ క్రయవిక్రయాల భూముల మ్యూటేషన్లు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ ఒక కారణమైతే.. ధరణి వెబ్‌సైట్‌ పుణ్యామా అని రోజుకో ఆంక్షతో రికార్డుల అప్‌డేషన్‌ ముందుకు సాగడంలేదు. మరోవైపు వివాదస్పద/ అభ్యంతరకర భూముల జాబితా(పార్ట్‌–బీ)లో చేర్చిన భూముల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవటంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.

Related Posts

Latest News Updates