Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పేదల ఇళ్లకు అనుమతులు అక్కర్లేదు!

తెలంగాణలో కొత్త మున్సిపల్‌ చట్టం అమల్లోకి వచ్చింది. 75 చదరపు గజాల వరకు నిర్మిత స్థలంలో జీ+1 (గ్రౌండ్‌ ఫ్లోర్‌+ఒకటో అంతస్తు) ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదని కొత్త చట్టం ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క రూపాయి రుసుం చెల్లించి మునిసిపాలిటీలో ఇంటిని నమోదు చేసుకోవాలని, దీంతో గ్యాస్‌ కనెక్షన్, రేషన్‌కార్డు, ఇంటి నంబర్, నల్లా కనెక్షన్‌ వంటి సదుపాయాలు సులువుగా పొందవచ్చు అన్నారు. మునిసిపల్‌ రికార్డుల్లో ఇళ్లు ఉంటే వీరికి లబ్ధి చేకూర్చడంæ ప్రభుత్వ యంత్రాంగానికి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సులువవుతుందన్నారు. వీరి నుంచి ఏడాదికి రూ.100 ఆస్తి పన్ను మాత్రమే వసూలు చేస్తామన్నారు.

Related Posts

Latest News Updates