Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

పోడు భూముల లెక్క నేనే తేల్చుతా!

‘‘తెలంగాణలో అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వం మీద ఇంకాస్త ఎక్కువగా ఉంటది. అదే సమయంలో గిరిజనుల హక్కులను కూడా పరిరక్షించాల్సి ఉంటుంది. అందుకే రాష్ట్రంలోని పోడు భూముల వ్యవహారాన్ని తెల్చేందుకు నేనే స్వయంగా రంగంలోకి దిగుతా! అన్ని జిల్లాలు, డివిజన్లకు వెళ్తా. నాతో పాటూ మంత్రివర్గాన్ని, అటవీ శాఖ ఉన్నతాధికారుల్ని, సీఎస్‌నీ, రెవిన్యూ సెక్రటరీని.. అందరం కలిసి మూకుమ్మడిగా బయలుదేరుతాం. ఇది పోడు భూమి.. ఇది పట్టా పట్టా అని అక్కడికక్కడే తేల్చేస్తాం’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. లెక్కతేల్చాక ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికానివ్వమని తేల్చిచెప్పారాయన.
పోడు భూములకు భరతవాక్యమే..
పొరుగు రాష్ట్రం నుంచి గుత్తికోయలు వచ్చి ఇష్టం వచ్చిట్లు నరికేస్తున్నరు. మన గిరిజనులు నష్టపోయే పరిస్థితి. కఠినంగా నియంత్రించాలంటే ఎక్కడ్నో ఓ కాడ ఈ పోడు భూములకు భరతవాక్యం పాడాలి. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కేంద్రం చట్టం నిబంధనల ప్రకారం హక్కులిస్తం. ఆ పేద గిరిజనులకు కూడా రైతు బం«ధు, రైతు భీమా రావాలి. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, స్థానిక సంస్థల ప్రతినిధులను తీసుకెళ్లి ఏ తాలుకా కేంద్రంలో సమస్య ఉంటే ఆ తాలుకా కేంద్రంలో బహిరంగంగా ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల సమక్షంలోనే సమస్య పరిష్కారం చేస్తం’’ అని వెల్లడించారు. కొత్త పురపాలక చట్టంపై శుక్రవారం శాసనసభలో ప్రసగిస్తున్న సమయంలో అడువులు తరిగిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆక్సిజన్‌ కూడా కొనుక్కుంటామా?
గ్రామ పంచాయతీలు, మునిపాలిటీల గడ్డాలు పట్టుకున్నా మొక్కలు పెట్టలేదు. నిర్లక్ష్యం విహిస్తున్నరు. మనం పెంచకపోతే అమెరికా వాడు వచ్చి పెంచడు కదా. ఏ రోజుకైనా మనకు మనమే మేలుకోవాలి. భయంకరమైన ఎండలు రావద్దంటే, రెండు మూడు డిగ్రీల ఎండను తగ్గించాలన్నా, మన భవిష్యత్‌ తరాలు గొప్పగా బతకాలన్నా మనమే ఏదైన చేయాలి. భవిష్యత్‌ తరాలకు బతకగల సమాజాన్ని ఇవ్వాలి. ఆక్సిజన్‌ కొనుక్కుంటామా అద్యక్షా. హైదరాబాద్‌లో ఆక్కిజన్‌ క్లబ్స్‌ వస్తున్నయి. సిగ్గు చేటు. బంజారహిల్స్‌లో నా చిన్నప్పుడు ఫ్యాన్లు కూడా ఉండకపోయేవి. అంత చల్లగా ఉండేది హైదరాబాద్‌. అటువంటి హైదరాబాద్‌ నేడు కాంక్రీట్‌ జంగిలైపోయి ఏయిర్‌ కండిషన్‌ లేకుండా బతకలేని పరిస్థితి అని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates