Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ప్రజావాణి అయితే మాకేంటి?

జలమండలి కార్యాలయంలో ప్రజా సమస్యలను వినేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి ఆదరణకు నోచుకోవటం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించాల్సి ఉన్నా కుత్బుల్లాపూర్‌ వాటర్‌వర్క్స్‌ అధికారుల తీరే సెపరేటు అన్న చందంగా మారింది. ఎప్పుడో ఉన్నతాధికారులు హడావుడి చేసినప్పుడే ప్రజావాణిని సకాలంలో ప్రారంభించడం.. సదరు అధికారులు వెళ్లిపోగానే ప్రజావాణికి గుడ్‌బై చెప్పడం ఇక్కడ పరిపాటిగా మారింది. వాటర్‌ వర్క్స్‌ డివిజన్‌ పరిధిలో సుమారు 60 వేల వరకు నీటి కనెక్షన్లకు చేరుకున్నా ప్రజల నీటి సమస్యలను పరిష్కరించేవారు కరువవుతున్నారు. దీంతో ప్రజావాణికి ఫిర్యాదు చేసేందుకు వచ్చే నీటి వినియోగదారులు అధికారుల రాకకోసం ఎదురుచూపులు వస్తోంది.
11 గంటలు దాటినా కానరాని అధికారులు..
ఉదయం 11 గంటలు దాటినా అధికారులు మాత్రం కార్యాలయాలకు కనుచూపు మేరలో కనిపించరు. మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా కనీసం ప్రజావాణి జరిగే రోజు కూడా అందుబాటులో ఉండటం లేదు. ప్రతి సోమవారం ఇదే తంతు కొనసాగడంపై పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 11.15 నిమిషాల తర్వాతే ప్రజావాణి ప్రారంభమైంది. దీంతో అప్పటి వరకు పలు కాలనీలకు చెందిన మహిళలు అధికారుల కోసం వేచి చూడాల్సి వచ్చింది.

¸÷sZ 15 MýS*ŽBÆý‡ 08í³: çÜÐ]l$Ķæ$ ´ë˯]lOò³ fËÐ]l$…yýlÍ G…yìl §é¯]l MìSÚùƊ‡ E™èl¢Æý‡$ÓË$..


ఎండీ ఆదేశాలు బేఖాతర్‌..
వాటర్‌ వర్క్స్‌ అప్పటి ఎండీ దానకిషోర్‌ 2017 జవరి 31న సిబ్బందికి సమయపాలనపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీపీఈ నుంచి పీఅండ్‌ఏ వరకు అన్ని విభాగాల సిబ్బంది ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలకు కార్యాలయాల్లో ఉండాల్సిందేనంటూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఇక్కడ మాత్రం అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది. ఒక్కో అధికారి ఒక్కో సమయానికి రావడం.. మధ్యాహ్నం భోజనాల తరువాత వెళ్లిపోవడం కామన్‌గా మారింది. అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బంది మొత్తం 11 గంటల నుంచి 12.30 మధ్య, ఆ తరువాత 1 గంట వరకు కార్యాలయాలకు చేరుకున్నారు. ఇక్కడ బయోమెట్రిక్‌ పద్ధతి ఉన్నా ఇప్పటికీ మాన్యువల్‌ అటెండెన్స్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఎంత లేటు వస్తే అంతే లేటుగా వెళ్లడం ఇక్కడ నిత్యం జరుగుతున్న తంతు.
ఇంజినీరింగ్‌ అధికారులదీ అదేతీరు..
ఇంజినీరింగ్‌ విభాగంలో ఉన్న జీఎం, డీజీఎం, మేనేజర్లు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు నూతన కనెక్షన్ల సెటిల్‌మెంట్లతోనే వీరి దినచర్య ప్రారంభమవుతందని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజావాణి రోజు సైతం అధికారులు అదే సిద్దాంతాన్ని ఫాలో అవుతుండటం విశేషం.

Related Posts

Latest News Updates