చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్.. ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌ప్లస్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 16 వేల చదరపు అడుగుల్లోని ఈ స్టోర్ ఆరు అంతస్తుల్లో ఉంటుందని, వచ్చే ఏడాది దీన్ని ప్రారంభిస్తామని వన్‌ప్లస్ సీఈఓ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వన్‌ప్లస్ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
స్టోర్ డిజైన్ రెండు భాగాలుగా..
వన్‌ప్లస్ స్టోర్ డిజైన్ రెండు భాగాలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. బయటి భాగంలో ఆధునిక హైదరాబాద్‌ను తలపించేలా స్వచ్ఛమైన తెలుపు రంగు ఉంటుంది. నానో మెటీరియల్‌తో ఉంటుంది కాబట్టి ధుమ్ము, ధూళిలను తట్టుకొని సుదీర్ఘకాలం పాటు మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక, లోపలి భాగంలో సంప్రదాయ హైదరాబాద్‌ను తలపించేలా రెడ్ బ్రిక్స్‌ను వినియోగిస్తారు. స్టోర్‌లో సహజ సిద్ధమైన కాంతిని వినియోగిస్తామని తెలిపారు.