Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో అక్రమంగా మతపరమైన నిర్మాణాలు!

మూసీ సుందరీకరణ పనులకు ప్రభుత్వం పక్కా స్కెచ్‌ వేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఉన్న లే–అవుట్లు, భవన నిర్మాణాలను గుర్తించేందుకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీ) డ్రోన్ల సహాయం తీసుకోనుంది.
ఫొటోలు తీస్తుంది..
ఆకాశంలో విహరించే ఈ డ్రోన్లు పై నుంచి మూసీ పరివాహన ప్రాంతాల్లో తిరుగుతూ.. శాటిలైట్‌ ఇమేజ్‌లు, ఫొటోలను గుర్తిస్తుంది. వీటిని ఎంఆర్‌డీసీ అధికారులు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అధికారులకు అందిస్తుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవిన్యూ విభాగంతో కలిసి వీటిల్లో అక్రమ నిర్మాణాలు, లే–అవుట్లను గుర్తించి కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.
మూసీ చుట్టూ 8529 అక్రమ నిర్మాణాలు..
2016లో రెవిన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని 8 మండలాల్లో 8,529 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. ఆసిఫ్‌ నగర్‌ మండలంలో 667 అక్రమ నిర్మాణాలు, అంబర్‌పేట్‌లో 989, బహుదూర్‌పురలో 4225, చార్మినార్‌లో 73, గోల్కొడలో 517, హిమాయత్‌నగర్‌లో 499, నాంపల్లిలో 650, సైదాబాద్‌ మండలంలో 903 అనధికార నిర్మాణాలున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో మతపరమైన నిర్మాణాలు..
ప్రభుత్వ భూముల్లో 3529 నివాస భవనాలు, 1946 వాణిజ్య భవనాలు, 228 మతపరమైన నిర్మాణాలు చేపట్టినట్లు రెవిన్యూ అధికారులు సర్వేలో తెలిసిందని ఎంఆర్‌డీసీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రైవేట్‌ భూముల్లో 3005 నివాస భవనాలు, 418 కమర్షియల్‌ బిల్డింగ్స్, 27 రిలీజియస్‌ స్ట్రక్చర్లు వెలిసినట్లు తెలిసింది.

Related Posts

Latest News Updates