బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రెస్టిజ్ గ్రూప్ మూడు ప్రీమియం ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. ఫాల్కన్ సిటీ పేరిట ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, టెక్నోస్టార్ పేరిట కమర్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, గుల్మోహర్ హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ప్రెస్టిజ్ గ్రూప్ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది దేశంలోని ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాల్లో 75 శాతం వృద్ధి నమోదు అయింది. 5 మిలియన్ల చ.అ. కంటే ఎక్కువ రిటైల్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. 2030 నాటికి దేశీయ రియల్ ఎస్టేట్ రంగం 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రస్ట్ (రీట్స్) పెట్టుబడులకు సెబీ అనుమతి ఇచ్చింది. దీంతో రానున్న రోజుల్లో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశముందని’’ వివరించారు.
మాల్స్ కింగ్ ప్రెస్టిజ్..
దేశంలో ఎక్కువ షాపింగ్ మాల్ స్పేస్‌ను కలిగి ఉన్న సంస్థ ప్రెస్టిజ్ గ్రూప్. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మంగళూరు, మైసూరు, ఉదయ్‌పూర్ ప్రాంతాల్లో 9 మాల్స్‌లను నిర్వహిస్తుంది. 5 మిలియన్ చ.అ.లకు మాల్ స్పేస్‌లో 2 వేల స్టోర్లు లీజుకు తీసుకున్నాయి. బెంగళూరు, చెన్నై, కోచి, కక్కనాడ్ ప్రాంతాల్లో 8.1 మిలియన్ చ.అ.ల్లో మరొక 5 మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. 2023 నాటికి 14 మిలియన్ చ.అ.ల్లో సుమారు 25 మాల్స్ల్లో 5 వేల స్టోర్లకు చేరుకోవాలన్నది ప్రెస్టిజ్ లక్ష్యం.
ఫాల్కన్ సిటీ:
సౌత్ బెంగళూరులోని కానకపుర రోడ్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో గృహాలు, రిటైల్, షాపింగ్ మాల్ ఉంటుంది. మొత్తం 2520 హైరైజ్ అపార్ట్మెంట్లుంటాయి. 2, 2.5, 3, 4 బీహెచ్‌కే గృహాలుంటాయి. వీటి విస్తీర్ణాలు 1204 చ.అ. నుంచి 2726 చ.అ. మధ్య ఉంటాయి. క్లబ్ హౌజ్, ఎంటర్టైన్మెంట్ జోన్, కల్చరల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంటుంది.
టెక్నోస్టార్:
బ్రూక్‌ఫీల్డ్ మెయిన్ రోడ్లో అడ్వాన్డ్స్ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్ ఇది. 1.8 ఎకరాల్లో సెంట్రల్ ఓపెన్ స్పేస్‌లో 10,54,655 చ.అ. వరల్డ్ క్లాస్ ఆఫీస్ స్పేస్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మూడు భవంతుల్లో ఉంటుంది. రెండు అంతస్తుల్లో ఫుడ్ అండ్ బేవరేజెస్, జిమ్, క్రచ్ వసతులుంటాయి. 1897 కార్లు పట్టేంత బేస్మెంట్ పార్కింగ్ ఉంటుంది.
గుల్మోహర్:
హోరమవు మెయిన్ రోడ్లో ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. 404 ఫ్లాట్లుంటాయి. 2, 2.5, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. 3.27 ఎకరాల్లో ఐదు హైరైజ్ అంతస్తుల్లో ఉంటుంది. 1169 చ.అ. నుంచి 1763 చ.అ. మధ్య విస్తీర్ణాలుంటాయి. క్లబ్ హౌజ్, హెల్త్ క్లబ్, మల్టిపర్పస్ హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్ వంటి ఏర్పాట్లుంటాయి.