అఫడబుల్ హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ కొత్త తరహా గృహ రుణాలను ప్రారంభించింది. ప్లంబర్, ఎలక్ట్రిషన్స్, కార్పెంటర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, టెక్నీషన్స్, సేల్స్మన్స్, సెక్యూరిటీ గార్డులు వంటి వంటి కార్మికులకు రుణాలు అందించనుంది. స్వరాజ్ విభాగం కింద వీరికి రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు గృహ రుణాలను అందిస్తామని ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ సీఈఓ మోను రత్రా తెలిపారు. స్థిర ఆదాయం లేని కార్మికులు, దినసరి కూలీలు, ఎలాంటి క్రెడిట్ హిస్టరీ, బ్యాంకింగ్ సేవలను లేని కార్మికులను దృష్టిలో పెట్టుకొని స్వరాజ్ పథకాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.