Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఫస్ట్‌ ఇంటి కొనుగోలుకే జీపీఎఫ్‌ సొమ్ము

ప్రభుత్వ ఉద్యోగి మొదటిసారి ఇల్లు లేదా ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు మాత్రమే జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) నగదును ఉపసంహరించుకునే వీలుంది. జీపీఎఫ్‌ 1960 నిబంధనల ప్రకారం.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి జీపీఎఫ్‌ 90 శాతం వరకు నగదును ఉపసహరించుకునే వీలుంది. అయితే అది తొలిసారి ఇంటి కొనుగోలుకేనని.. రెండోసారి ప్రాపర్టీని కొనడానికి మళ్లీ జీపీఎఫ్‌ సొమ్మును తీసుకోవటానికి వీల్లేదని కేంద్ర పర్సనల్, పెన్షన్స్‌ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. రెండో ఇంటి కొనుగోలుకు జీపీఎఫ్‌ సొమ్ము తీసుకునే వెసలుబాటు గానీ, జీపీఎఫ్‌ నిబంధనల మార్పు వంటి ప్రతిపాదనలేవీ లేవని, ఆ దిశగా కేంద్రం యోచించటం లేదని ఆయన స్పష్టం చేశారు.

Related Posts

Latest News Updates