రియల్ ఎస్టేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జోన్స్ లాంగ్ లాసెల్లీ (జేఎల్ఎల్) ఫార్చ్యూన్ 500 జాబితాలో తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గతంలో 189వ స్థానంలో ఉన్న ర్యాంక్.. తాజాగా 169కి చేరినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే అతిపెద్ద కంపెనీగా అవతరించినట్లయిందని జేఎల్ఎల్ సీఈఓ క్రిస్టియాన్ యుల్బ్రిచ్ తెలిపారు. 2018లో జేఎల్ఎల్ మొత్తం ఆదాయం 16.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం జేఎల్ఎల్ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సుమారు 91 వేల మంది ఉద్యోగులున్నారు.
జేఎల్ఎల్ ఇండియా రూ.4 వేల కోట్లు..
జేఎల్ఎల్ ఇండియా విభాగానికి ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, చెన్నై, హైదరాబాద్, కోల్కత్తా, అహ్మదాబాద్, కోచి, కోయంబత్తూరు పది నగరాల్లో సేవలందిస్తుంది. వీటిల్లో సుమారు 11 వేల మంది ఉద్యోగులుంటారు. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యించామని తెలిపింది.