Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

బంజారా లేదా జూబ్లిహిల్స్‌లో అపర్ణా 2.ఓ

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ మరొక అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తోంది. ఇప్పటికే షేక్‌పేట్‌లో అపర్ణా వన్‌ పేరిట ప్రీమియం నివాస సముదాయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అచ్చం ఇలాంటి మరొక ప్రాజెక్ట్‌ అపర్ణా 2.ఓను బంజారాహిల్స్‌ లేదా జూబ్లిహిల్స్‌లో నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తోంది.
9 ఎకరాలు; 464 లగ్జరీ యూనిట్లు..
షేక్‌పేటలో 9 ఎకరాల్లో అపర్ణా వన్‌ రూపుదిద్దుకుంటోంది. 3.6 మీటర్ల సీలింగ్‌ ఎత్తుండే ఈ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌లోనే అతి పొడవైన నివాస సముదాయం. 6 టవర్లు, 36 అంతస్తుల్లో మొత్తం 464 లగ్జరీ యూనిట్లుంటాయి. 2800 నుంచి 5000 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.11,999.
విదేశాల నుంచి దిగుమతి..
ఇటలీ, జర్మనీ వంటి దేశాల నుంచి ఫ్లోరింగ్, శానిటరీ ఉత్పత్తులు, ప్రధాన ద్వారాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికే 25 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, తయారీ రంగ కంపెనీల సీఈఓలు, ఎండీలు, సీనియర్‌ మేనేజర్లు కస్టమర్లుగా ఉన్నారు.
ఏడాదిలో వెయ్యి ఫ్లాట్ల అప్పగింత..
ప్రస్తుతం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు మూడు ప్రాంతాల్లో కలిపి కోటి చ.అ.ల్లో పలు నివాస సముదాయ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. అమరావతిలో 10 లక్షల చ.అ., బెంగళూరులో 8 లక్షల చ.అ., హైదరాబాద్‌లో 82 లక్షల చ.అ.ల్లో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో కోటిన్నర చ.అ.లో ప్రాజెక్ట్‌లను నిర్మించాలని లక్ష్యించాం. ఈ ఏడాది ముగింపులోగా 50 లక్షల చ.అ. అభివృద్ధి, సుమారు 1000 గృహాలను నిర్మించి కొనుగోలుదారులకు అందించనున్నామని అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ రెడ్డి తెలిపారు.
పటాన్‌చెరులో అపార్ట్‌మెంట్స్‌..
శంకర్‌పల్లిలోని మోకిలాలో వెస్ట్రన్‌ మెడోస్‌ ఫేజ్‌–4ను ప్రారంభించనుంది. ఇందులో 1500 ప్లాట్లుంటాయి. ఏడాదిలో పటాన్‌చెరులో 2 వెంచర్లను అభివృద్ధి చేయనుంది. వీటిల్లో సుమారు 1200 ప్లాట్లొస్తాయి. గుండ్లపోచంపల్లిలోని కనోపీ తులిప్‌లో ఫేజ్‌–3ని ప్రారంభించనుంది. వీటితో పాటూ పటాన్‌చెరు, కొండాపూర్, పుప్పాలగూడ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను నిర్మించనుంది.

Related Posts

Latest News Updates