వడ్డీ మినహాయింపుపై పరిమితి సరైంది కాదు
– జక్షయ్ షా, చైర్మన్, క్రెడాయ్
వడ్డీ మినహాయింపులు కేవలం రూ.45 లక్షల ధర గృహాలకు మాత్రమే పరిమితం చేయడం కొంత అసంతృప్తి. ఎందుకంటే ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఈ ధర గృహాలకు ఆశించిన స్థాయిలో సప్లయి లేదు. అందుకే అన్ని రకాల గృహాలకు వడ్డీ మినహాయింపును ఇవ్వాలి.
అందరికీ ఇళ్లు చేరుకుంటాం
– నిరంజన్ హిర్‌నందానీ, ప్రెసిడెంట్, నరెడ్కో
కేంద్ర ప్రభుత్వం హౌజింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అందుబాటు గృహాలకు ప్రభుత్వ స్థలాల కేటాయింపు, వడ్డీ రాయితీలు వంటివి ఈ విభాగానికి బూస్ట్నిస్తాయి. అయితే ముంబైలో మినహా దేశమంతటా అఫడబుల్ హౌజింగ్ విజయవంతం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్థలాల కొరత ఎక్కువగా ఉంది.
నగరాల్లో అద్దె గృహాలకు డిమాండ్
– అన్షుమన్ మేగజైన్, చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా
రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ, రెంటల్ పాలసీ, పీఎంఏవై కేటాయింపులు గృహ విభాగంలో డిమాండ్ తీసుకొస్తాయి. గృహల సరఫరా పెరగడంతో పాటూ బ్యాంక్‌లకు లిక్విడితో కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. రెంటల్ హౌజింగ్ పాలసీతో ప్రధాన నగరాల్లో అద్దె గృహాల సరఫరా పెరిగే అవకాశముంది.
తొలిసారి కొనుగోలుదారులకే ప్రయోజనం
– అనూజ్ పురీ, చైర్మన్, అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ
అదనపు వడ్డీ రాయితీ కేవలం తొలిసారి గృహ కొనుగోలుదారులు, అందులోనూ రూ.45 లక్షల లోపు ధర ఉండే గృహాలకు కేటాయించడం సరైంది కాదు. ఇన్వెంటరీ గృహాల కోసం ప్రత్యేక నిధి కేటాయింపుపై బడ్జెట్లో ప్రస్థావనే లేదు. పీఎంఏవై ప్రోత్సాహకాలతో ఈ విభాగంలో పెట్టుబడులు వచ్చే అవకాశముంది.
రూ.45 లక్షల లోపు గృహాలకు డిమాండ్
– రమేష్ నాయర్, సీఈఓ, జేఎల్ఎల్ ఇండియా
అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ మినహాయిపు కారణంగా తొలిసారి గృహ కొనుగోలుదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో రూ.45 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు డిమాండ్ పెరుగుతుంది.