Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

బౌరంపేటలో కేసీఆర్‌ 2బీహెచ్‌కే బ్రేక్‌

కేసీఆర్‌ 2 బీహెచ్‌కే నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ప్రాజెక్ట్‌లు కొన్ని చోట్ల వేగంగా సాగుతుంటే.. మరికొన్న చోట్ల నత్తనడకన సాగుతున్నాయి.
బౌరంపేటలో నిలిచి..
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా రూ.1150.80 కోట్లతో 13,404 డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో బౌరంపేట గ్రామ సర్వే నంబరు 166లో 10 ఎకరాల 15 గంటల విస్తీర్ణంలో 186.84 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. అయితే గత కొన్ని నెలలుగా ఇక్కడ పనులు ఆగిపోయాయి. ఆది నుంచి ఇక్కడ పనులు నత్తనడకన కొనసాగుతుండగా ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయాయి. సెల్లార్‌ గుంతలు తీసి పిల్లర్ల పుట్టింగ్‌ వేసి పనులు ఆపేశారు.
బిల్లులు చెల్లించకే..
ప్రస్తుతం బౌరంపేట్‌లో డబుల్‌ బెడ్‌ రూం సైట్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా పనివారు కనిపించడం లేదు. కనీసం ఇక్కడ ఉన్న స్టీల్‌కు సెక్యూరిటీ కూడా లేని పరిస్ధితి నెలకొంది సైట్‌ సమీపంలోనే నిర్మాణం కొసం తెప్పించిన ఇసుక రాసులుగా పోసి కనిపిస్తోంది. సదరు కాంట్రక్టర్‌కు బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ పనులు నిలిచిపోయాయి.

Related Posts

Latest News Updates