బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ టాంగ్లిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ న్యూయార్క్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ గ్రూప్‌కు చిక్కింది. కెఫే కాఫీ డే (సీసీడీ) ఫౌండర్ వీజీ సిద్దార్థకు చెందిన కంపెనీయే టాంగ్లిన్ డెవలప్మెంట్స్. దీన్ని సుమారు రూ.2700–2800 కోట్లకు బ్లాక్‌స్టోన్‌కు అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇటీవలే సాఫ్ట్వేర్ కంపెనీల విక్రయం..
ఇటీవలే సిద్దార్థ సీసీడీలోని రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్‌లోని తన 20.32 శాతం వాటాను మైండ్‌ట్రీ లిమిటెడ్, ఎల్ అండ్ టీలకు రూ.3200 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.