బ్లాస్టింగ్ పరేషాన్సాధారణంగా నివాస లేదా వాణిజ్య సముదాయాలను నిర్మించేటప్పుడు సెల్లార్ తవ్వకం కోసం బ్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది. భూమి లోపల 10 అడుగుల లోతు కంటే ఎక్కువ సెల్లార్ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వస్తుంటాయి. వీటిని తొలగించే పనిని డెవలపర్లు కాంట్రాక్టర్‌కు అప్పచెబుతుంటారు. సాధ్యమైనంత వరకు సంబంధిత కాంట్రాక్టర్లు వీటిని కూలీలు, పనిముట్ల సహాయంతో తొలగిస్తుంటారు. పెద్ద పెద్ద బండరాళ్లు, కఠినమైన రాళ్లు వచ్చిన సందర్భాల్లో మాత్రం పేలుళ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇదే డెవలపర్లకు నరకంగా మారింది. ఎందుకంటే బ్లాస్టింగ్ అనుమతులు ఏ ప్రభుత్వ విభాగం ఇస్తుంది? ఎన్ని రోజుల్లో అనుమతులొస్తాయి? అసలు ఫీజు ఎంత? ఎలాంటి పత్రాలను జత చేయాలి? వంటి విధివిధానాలేవీ లేవని ఓ డెవలపర్ వాపోయారు.చేతులు తడిపితేనే అనుమతులు..బ్లాస్టింగ్ అనుమతుల కోసం కాళ్ల చెప్పులరిగేలా తిరిగితే తప్ప రాని పరిస్థితి. పైగా చేతి చమురూ వదులుకోవాల్సిందే. స్థానిక పోలీసులు, అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి పని చేసుకోవాల్సి వస్తుందని.. దీంతో అనవసరంగా అవినీతి పెరుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఒక్క ప్రాజెక్ట్‌కు బ్లాస్టింగ్ అనుమతుల కోసం ఆరేడు నెలల దాకా వేచి ఉండాల్సి వస్తుందని దీంతో ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుందన్నారు. మున్సిపల్ శాఖ నుంచి వచ్చే నిర్మాణ అనుమతుల కంటే కష్టతరమైనవి బ్లాస్టింగ్ అనుమతులు రావటమని వాపోయారు.విధివిధానాలుండాల్సిందే..– పేలుళ్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కోసం ప్రత్యేకంగా విభాగం, అధికారులు ఉండాలి. పేలుళ్లు జరిపే క్రమంలో పర్యవేక్షణ జరపాలి.– దరఖాస్తు ప్రక్రియ, జత చేయాల్సిన పత్రాలతో కూడిన విధివిధానాలుండాలి.– స్థానిక మున్సిపాలిటీలోనే నిర్మాణ అనుమతులతోనే పేలుడుకు సంబంధించిన అనుమతులు ఇస్తే బాగుంటుంది. – అన్ని సందర్భాల్లోనే పేలుడు పదార్థాలను వినియోగించకుండా సాధ్యమైతే రసాయనాలను వినియోగించే వీలుండాలి.– స్థానికంగా ఉన్న ఇతర భవనాలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ ఏర్పాట్లు తీసుకోని డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.