Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్‌ బ్యాంక్‌ లాకర్‌ తనిఖీ

రిజిస్ట్రేషన్‌ కోసం లంచం డిమాండ్‌ చేయగా.. ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్‌ దేవులపల్లి సంగీత బ్యాంక్‌ ఖాతాలు, లాకర్లను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీ చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌ సంగీతతో పాటూ భర్త నాగరాజు, కారు డ్రైవర్‌ జి. రామకృష్ణ, డాక్యుమెంట్‌ రైటర్‌ కె. గణేష్‌ నలుగురిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.
వెండి వస్తువుల లభ్యం..
విచారణలో నిందితుల నుంచి సేకరించిన రూ.30 వేలను సంగీత భర్త నాగరాజుకు అప్పగించామని కారు డ్రైవర్‌ రామకృష్ణ ఏసీబీ అధికారులతో చెప్పారు. ఏసీబీ అధికారులు సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కానీ, ఎలాంటి డబ్బు కనుగొనలేకపోయారు. బ్యాంక్‌ లాకర్లను తనిఖీ చేయగా.. వెండి వస్తువులు లభించాయి. ఏసీబీ అధికారులు మరొక బ్యాంక్‌ లాకర్‌ ఉందని.. దీన్ని సోమవారం తనఖీ చేయనున్నట్లు తెలిపారు.
రిజిస్ట్రేషన్‌ కోసం రూ.35 వేలు డిమాండ్‌..
రిజిస్ట్రేషన్, జీపీఏ, మార్ట్‌గేజ్‌ డీడ్స్, డాక్యుమెంట్‌ నంబర్ల కేటాయింపు కోసం సబ్‌రిజిస్ట్రార్, తన అనుచరులు రూ.35 వేలు లంచం డిమాండ్‌ చేస్తున్నారని న్యాయవాది మరియు డాక్యుమెంట్‌ రైటర్‌ అయిన అర్షద్‌ హుస్సేన్‌ ఫిర్యాదు చేయగా ఏసీబీ అధికారులు పథకం వేసిరెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Related Posts

Latest News Updates