Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

మాల్‌లోనే ఆఫీస్‌

దశాబ్ధ కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో మార్పు వచ్చింది. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతి వంటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడిని తగ్గిస్తుందని.. దీంతో మరింత క్రియేటివిటీ బయటికొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్‌ స్పేస్‌ భర్తీ చేస్తుండటంతో ప్లగ్‌ అండ్‌ ప్లే ఆఫీసులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్‌ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలూ కో–వర్కింగ్‌ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.20 లక్షల చ.అ.కు కో–వర్కింగ్‌ స్పేస్‌..2010లో ప్రపంచవ్యాప్తంగా 600 సెంటర్లలో 21 వేల కో–వర్కింగ్‌ సీట్లుండగా.. ఇప్పుడవి 18,900 సెంటర్లలో 17 లక్షల సీట్లకు పెరిగింది. మన దేశంలో ఏటా 4.1 కోట్ల చ.అ. కార్యాలయాల స్థల లావాదేవీలు జరుగుతుండగా.. ఇందులో 20 లక్షల చ.అ. స్థలం కో–వర్కింగ్‌ స్పేస్‌ ఉంటుందని ఓ సర్వే తెలిపింది. 43 శాతం లావాదేవీలతో బెంగళూరు ప్రధాన స్థానంలో, ఆ తర్వాత ఎన్‌సీఆర్‌ 16 శాతం, హైదరాబాద్‌ 15 శాతం, పుణె 12 శాతం, ముంబై 10 శాతం, అహ్మదాబాద్‌ 3 శాతం, చెన్నై 2 శాతం లావాదేవీలు జరిగాయని నివేదిక వెల్లడించింది. ఏటా 30–40 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో రీగస్, వీవర్క్, కోవర్క్స్, ఐకివా, వర్క్‌ ఏ ఫీలా, టేబుల్‌ స్పేస్, అఫీస్, అపీజే, స్మార్ట్‌వర్క్స్‌ వంటి సుమారు 200ల కో–వర్కింగ్‌ కంపెనీలు 400 సెంటర్లలో సేవలందిస్తున్నాయి.గంట, రోజు, నెల వారీగా చార్జీలు..ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులు ఉండటాన్ని కో–వర్కింగ్‌ స్పేస్‌ అంటారు. ఇక్కడ వ్యాపారం ఎవరిది వారిదే, ఎవరి ప్రమాణాలు వారివే. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్‌ ఆఫీసు, ఫిక్స్‌డ్‌ డెస్క్‌లు, సమావేశ గది, క్యాబిన్లు వంటి సౌకర్యాలుంటాయి. వీటితో పాటూ ప్రత్యేకంగా బహుళ జాతి కంపెనీలకు ఉండే కొరియర్‌ సర్వీస్, ఫుడ్, లాంజ్, ఎల్‌సీడీ, పార్కింగ్, ప్రింటర్, ప్రొజెక్టర్, వై–ఫై వంటి అన్ని రకాల ఆధునిక వసతుంటాయి. కో–వర్కింగ్‌ కార్యాలయాల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. హైదరాబాద్‌లో నెలకు రూ.5–10 వేలు, పుణెలో రూ.4–10 వేలు, గుర్గావ్‌లో రూ.7–17 వేలు, ముంబైలో రూ.9–30 వేలు, బెంగళూరులో రూ.4–15 వేలు, చెన్నైలో రూ.7–15 వేలుగా ఉన్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లిహిల్స్‌ వంటి ప్రాంతాల్లో కో–వర్కింగ్‌ ఆఫీసులున్నాయి.మౌలిక వసతుల వ్యయం తగ్గుతుంది..ఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో ఆక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్‌లోనే స్పేస్‌ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతుంది. ఇదే కో–వర్కింగ్‌ డిమాండ్‌కు ప్రధాన కారణమని అఫీస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ అమిత్‌ రమణి తెలిపారు. గ్రీడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌తో పోలిస్తే కో–వర్కింగ్‌ స్పేస్‌లో అద్దెలు 25 శాతం వరకు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్‌ స్పేస్‌లో ఒక్కో సీటుకు 5–15 శాతం స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్‌ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్‌ వంటి ఏర్పాట్లుంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. 

Related Posts

Latest News Updates