హైదరాబాద్‌లో ఐనాక్స్ 3వ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. మియాపూర్‌లోని జీఎస్ఎం మాల్లోని ఈ మల్టీప్లెక్స్‌లో ఎనిమిది ఆడిటోరియమ్స్లో కలిపి సుమారు 1,691 సీట్లుంటాయి. ఇప్పటికే ఐనాక్స్ బంజారాహిల్స్‌లోని జీవీకే వన్ మాల్లో, కాచిగూడలోని మహేశ్వరీ పరమేశ్వరీ మాల్స్‌లో ఉన్నాయి. తాజాగా మూడో మల్టిప్లెక్స్తో కలిపి నగరంలో ఐనాక్స్ స్క్రీన్ల సంఖ్య 19కి చేరింది.