Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ముంబైగా మారుతున్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వంటి స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లు, బీఏఆర్సీ, ఎన్పీసీఎల్, ఐఆర్‌ఈఎల్‌ వంటి పరిశోధన సంస్థలు, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమతో దేశ ఆర్థిక రాజధాని పేరుగాంచిందేదంటే ముంబై అని ఠక్కున చెప్పేస్తాం. కానీ, ఇకపై అలా కుదరదు. ఎందుకంటే దేశంలో మరో ముంబై నగరం తయారుకాబోతోంది. అది మన హైదరాబాద్‌లోనే. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ముంబై  కంటే రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.హైదరాబాద్‌ మెట్రో రైల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌), ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో ఇప్పటికే హైదరాబాద్‌ పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగిపోతోంది. ఇక ఇప్పుడు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ అభివృద్ధితో మరింత తలమానికంగా నిలవనుంది. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ బంజారాహిల్స్‌తో మొదలైందని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. ముందుగా బంజారాహిల్స్‌ ఆ తర్వాత జూబ్లిహిల్స్‌ నుంచి మాదాపూర్‌కు, ఆపైన గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు పరుగులు పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ బూమ్‌ తెల్లాపూర్‌ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు విస్తరించింది. దీన్ని రియల్‌ ఎస్టేట్‌ పరిభాషలో  ‘డెవలప్‌మెంట్‌ మేకింగ్‌ షిఫ్ట్‌’గా చెబుతారు.స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ నుంచి స్టార్‌ హోటల్స్‌ వరకు..ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో దేశ, విదేశీ సంస్థలకు చెందిన బడా సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. వీటిలో స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ నుంచి స్టార్‌ హోటళ్ల వరకు అన్నీ ఉన్నాయి. సుమారు 80 ఎకరాల్లో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు సమీపంలోని మంచిరేవుల ప్రాంతంలో వంద అంతస్తుల బిజినెస్‌ టవర్‌ రానుంది. దీన్ని 2007లో రిలయెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రతిపాదించింది. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ) శాశ్వత ఆఫీసు చిరునామా కూడా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు మారింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఓ సంస్థ హిల్‌టౌన్‌ హోటల్, అమెరికాకు చెందిన యూఎస్‌ కాన్సులేట్, మారియట్, హయత్‌ హోటళ్లు, ఆధునిక చికిత్స విధానాలతో కాంటినెంటల్‌ ఆసుపత్రులిక్కడ ఉన్నాయి.ఐటీ కంపెనీలు కూడా..ఇప్పటికే ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మైక్రోసాఫ్ట్, డెల్, ఇన్ఫోసిస్‌ వంటి 72 ఐటీ కంపెనీలున్నాయి. వీటిలో సుమారుగా 35 నుంచి 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఉన్నత శ్రేణి వర్గాలకు చిరునామా..ఇప్పటివరకు హైదరాబాద్‌లోని ధనవంతులకు మొదటి సొంతిల్లు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలిల్లో ఉండేది. మరి రెండో ఆస్తి బెంగళూరు, చెన్నై వంటి ఇతర ప్రాంతాల్లో ఉండేది. కానీ ఇకపై వీరు కూడా వారి రెండో ఆస్తిని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉండేందుకు ఇష్టపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఉన్నత శ్రేణి వర్గాలుండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేందుకు. గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీల్లో పనిచే సే ఉద్యోగుల్లో ఎక్కువ వేతనాలున్న వారు గచ్చిబౌలిలో, తక్కువ వేతనాలున్న వారు కూకట్‌పల్లి, కొండాపూర్‌ వంటి పరిసర ప్రాంతాల్లో ఎలాగైతే ఉంటున్నారో అదేవిధంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పూర్తిగా హై ఎండ్‌ ఫ్యామిలీకి, మధ్య, దిగువ మధ్యతరగతి వర్గాలకు లింగంపల్లి సరైన ప్రాంతమని నిపుణులు చెబుతున్నారు. వీరందరికీ ప్రీమియం ఇళ్లను, షాపింగ్‌ మాల్స్, స్టార్‌ హోటల్స్‌ వంటి ఆధునిక వసతులెన్నో కల్పించేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి.

Related Posts

Latest News Updates