దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైలు నాల్గో దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ మెట్రో రైల్ లిమిటెడ్ 6 రూట్లలో 104 కి.మీ.ల ఫేజ్–4 నిర్మాణ పనులను ప్రతిపాదించగా.. కేంద్రం మూడు రూట్లలో 61.679 కి.మీ. పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మూడు రూట్లు ఇవే..
ముకుంద్‌పూర్ – మౌజ్‌పూర్ (12 కి.మీ.), ఆర్కే ఆశ్రమ్ – జానకిపురీ వెస్ట్ (28 కి.మీ.), ఎయిరోసిటీ – తుగ్లకాబాద్ (20 కి.మీ.) కారిడార్లలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) కార్నర్న్ మార్గల గుండా మెట్రో పరుగులు పెట్టనుందని సమాచారం.
రూ.25 వేల కోట్ల వ్యయం..
61.679 కి.మీ. మెట్రో మార్గంలో 46 స్టేషన్లు రానున్నాయి. వీటిలో 17 ఎలివేటెడ్ రూట్స్. నిర్మాణ వ్యయం సుమారు రూ.25 వేల కోట్లు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.