Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మై హోమ్‌లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మై హోమ్‌ గ్రూప్‌ మీద ఆదాయ పన్ను శాఖ (ఐటీ) కన్నేసింది. మై హోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రామేశ్వర రావు జూపల్లి ఇళ్లు, ఆఫీసు, గ్రూప్‌ కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. బెంగళూరుకు చెందిన ఐటీ అధికారులు ప్లాన్‌ ప్రకారం జూబ్లిహిల్స్‌ నందగిరి హిల్స్‌లోని రామేశ్వర రావు ఇళ్లు, మాదాపూర్‌లోని మై హోమ్‌ గ్రూప్‌ ఆఫీసులో తనిఖీలు చేశారు.
ఆర్‌ఎంజెడ్‌తో ఒప్పందం..
17–18 మంది ఐటీ అధికారులు మూడు వాహనాల్లో హైదరాబాద్‌కు చేరుకొని, ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ఆర్‌ఎంజెడ్‌తో కార్ప్‌తో ఒప్పందం చేసుకుంది. 50:50 పార్టనర్‌షిప్‌తో హైటెక్‌సిటీలో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఫేజ్‌–1 ప్రాజెక్ట్‌ స్కైవ్యూను 35 లక్షల చదరపు అడుగుల్లో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఆయా లావాదేవీలనూ ఐటీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.
రూ.3,300 కోట్ల టర్నోవర్‌..
కన్‌స్ట్రక్షన్, సిమెంట్, మాన్యుఫాక్చరింగ్, పవర్, కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్‌ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంది. రామేశ్వర రావు జూపల్లి 23 కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. సుమారు రూ.3,300 కోట్ల టర్నోవర్‌ ఉంది.

Related Posts

Latest News Updates