Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

మై హోమ్‌ సంపద రూ.3,300 కోట్లు

హైదరాబాద్‌లో నిర్మాణాలే కాదు.. ఇదే రియల్టీలో సంపదను సృష్టిస్తున్న శ్రీమంతులూ ఉన్నారు. భాగ్యనగరం నుంచి అత్యధిక రియల్‌ ఎస్టేట్‌ ధనవంతుల జాబితాలో మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత రామేశ్వర్‌ రావు జూపల్లి తొలిస్థానంలో నిలిచారు. ఈయన సంపద రూ.3,300 కోట్లు! అంతేకాదండోయ్‌.. ప్రతి ఏటా విడుదల చేసే ‘గ్రోహే హ్యురన్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ ధనవంతుల జాబితాలో తొలిసారిగా రామేశ్వర్‌ రావుకు చోటు దక్కింది. దేశంలోని మొత్తం వంద మంది రియల్టీ టైకూన్స్‌లో మై హోమ్‌ స్థానం 14. నగరం నుంచి రెండో రియల్టీ ధనికుల్లో తాజ్‌ అండ్‌ జీవీకే హోటల్స్‌ అధినేత జీవీకే రెడ్డి అండ్‌ ఫ్యామిలీ నిలిచింది. వీళ్ల సంపద విలువ రూ.1,080 కోట్లు! వంద మంది జాబితాలో జీవీకే 63వ స్థానంలో నిలిచారు. ఇక, రూ.980 కోట్ల సంపదతో అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రతినిధులు సీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్‌ సుబ్రమణ్యం రెడ్డిలు మూడో స్థానంలో నిలిచారు. గ్రోహే జాబితాలో వీళ్లది 66వ స్థానం!జర్మనీకి చెందిన ప్రీమియం శానీటరీ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రోహే. మన దేశంలో పుట్టి,  ఇక్కడే పెరిగిన రియల్టీ వ్యాపారస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకొని నివేదికను అభివృద్ధి చేశారు. దేశంలోని 100 మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తుల సంపద విలువ రూ.2,36,610 కోట్లు. 2017తో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. 2017లో వీళ్ల సంపద రూ.1,86,700 కోట్లుగా ఉంది. 2018 గ్రోహే హ్యూరన్‌ రియల్టీ ధనవంతుల్లో లోధా గ్రూప్‌కు చెందిన మంగల్‌ ప్రభాత్‌ లోధా మొదటి స్థానంలో నిలిచారు. ఈయన సంపద రూ.27,150 కోట్లు. రూ.23,160 కోట్లతో ఎంబసీ అధినేత జితేంద్ర విర్వాణీ రెండో స్థానంలో, రూ.17,690 కోట్ల సంపదతో డీఎల్‌ఎఫ్‌ ప్రతినిధి రాజీవ్‌ సింగ్‌ మూడో స్థానంలో నిలిచారు.జాబితాలో శ్రీమంతురాళ్లు కూడా..2018 గ్రోహే హ్యూరన్‌ రియల్టీ ధనవంతుల్లో తొలిసారిగా మహిళలూ చోటు దక్కించుకున్నారు. ఈసారి రియల్టీ టైకూన్స్‌లో 9 మంది మహిళ శ్రీమంతురాళ్లున్నారు. మహిళ విభాగంలో డీఎల్‌ఎఫ్‌ ప్రతినిధి రేణుకా తల్వార్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈమె సంపద రూ.2,780 కోట్లు. మొత్తం 100 మంది జాబితాలో ఈమెది 19వ స్థానం.24 ఏళ్లకే బిజినెస్‌ టైకూన్‌..గ్రోహే హ్యూరన్‌–2018 జాబితాలో 59 శాతం తొలితరం పారిశ్రామికవేత్తలే ఉన్నారు. అత్యంత పిన్న వయసు రియల్టీ ధనవంతుల్లో ఆర్‌ఎంజెడ్‌ అధినేత కునాల్‌ మెండా (24 సంవత్సరాలు) ప్రథమ స్థానంలో నిలిచారు. బెంగళూరుకు చెందిన కునాల్‌ సంపద రూ.530 కోట్లు. ఇక, అత్యంత వృద్ధ ధనవంతుల్లో ఈస్ట్‌ ఇండియా హోటల్స్‌ అధినేత పృథ్వీరాజ్‌ సింగ్‌ ఓబెరాయ్‌ (89 సంవత్సరాలు) నిలిచారు. న్యూ ఢిల్లీకి చెందిన ఈయన సంపద రూ.3,290 కోట్లు.ముంబై శ్రీమంతుల నగరం..దేశంలోని 100 మంది రియల్టీ శ్రీమంతుల్లో 78 శాతం ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులోనే ఉన్నారు. 35 మంది శ్రీమంతులు ఒక్క ముంబై నగరంలోనే ఉన్నారు. న్యూ ఢిల్లీలో 22 మంది, బెంగళూరులో 21, పుణెలో 5, నోయిడా, చెన్నై, గుర్గావ్, కొచ్చిల్లో 2, కోల్‌కత్తా, థానే, అహ్మదాబాద్‌లో ఒక్కరు చొప్పున ఉన్నార

Related Posts

Latest News Updates