భారతదేశ ప్రముఖ సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (ఎంవీ) జన్మదినం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకొని స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ట్రస్ట్ ఉత్తమ సివిల్ ఇంజనీర్లకు అవార్డులను ప్రదానం చేస్తుంది. ప్రతి ఏటా లాగే 2019లోనూ ఉత్తమ ఇంజనీర్ల అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విజేతలకు బంగారు నాణెం..
బెస్ట్ లెర్నర్, బెస్ట్ అకడమిషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్, బెస్ట్ ఇంజనీర్ (ప్లానింగ్ అండ్ డిజైన్) నాలుగు కేటగిరీల్లో అవార్డులను ఎంపిక చేస్తుంది. విజేతలకు రూ.10 వేలు విలువ చేసే బంగారు నాణెం, మోమెంటో, ట్రోఫీ, శాలువను అందజేస్తారు. నిర్మాణ రంగంలోని ఇంజనీర్లు, పరిశోధకులు, బోధకులు, విద్యార్థులు, కన్సల్టెంట్స్, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, డెవలపర్లు తదితరులు దరఖాస్తులకు అర్హులు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 31.
మరిన్ని వివరాలకు..
మరిన్ని వివరాలకు ఖైరతాబాద్ కుషల్ టవర్స్‌లోని స్మార్ట్ ఇన్ఫ్రా–ఈఎస్టీ కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా +91 81859 42663 (ప్రశాంత్) నంబర్లో గానీ mvawards2019@gmail.com మెయిల్ చేయవచ్చని స్మార్ట్ ఇన్ఫ్రా–ఈఎస్టీ మెంటార్ పి. సూర్య ప్రకాశ్ తెలిపారు.