Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.10 వేలే

మహారాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) రిజిస్ట్రేషన్‌ ఫీజును తగ్గించేసింది. గతంలో మహా రెరాలో ప్రాజెక్ట్‌ను నమోదు చేయాలంటే కనీస ఫీజు రూ.50 వేలుగా ఉండేది. కానీ, తాజాగా ఈ రుసుమును రూ.10 వేలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని చిన్న డెవలపర్లను సైతం రెరాలో నమోదుకు ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ప్రకటనల ఖర్చు నిర్మాణ వ్యయం కింద చూపొంచొద్దు..
ఇక నుంచి డెవలపర్లు ప్రాజెక్ట్‌ ప్రకటనలు, ప్రచారం కోసం చేసే ఖర్చులను నిర్మాణ వ్యయం కింద చూపించ కూడదని పేర్కొంది. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని ఇందులో 70 శాతం సొమ్మును కేవలం ఆ ప్రాజెక్ట్‌ నిర్మాణ అవసరాల కోసం ఖర్చు చేయాలని తెలిపింది.

Related Posts

Latest News Updates