Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

రియల్టీ పెట్టుబడులకు సరైన ప్రాంతం హైదరాబాద్‌!

హైదరాబాద్‌లో స్థలాలు, ప్రాపర్టీల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు క్రమంగా విక్రయాలను పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈ ట్రెండ్‌ మరింత జోరుగా కొనసాగుతుందని నిపుణులు ధీమావ్యక్తం చేస్తున్నారు. గత 10–12 నెలల కాలంలో నగరంలో నివాస సముదాయాల ధరలు 10–15 శాతం, కమర్షియల్‌ ప్రాపర్టీల అద్దెలు 20 శాతం మేర పెరిగాయి. స్థలాల ధరలు 20 శాతం వరకు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ పాలసీలు, మెరుగైన మౌలిక వసతుల ఏర్పాట్లతో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెబుతున్నారు.
793 మిలియన్‌ డాలర్లు..
హైదరాబాద్‌లోని కమర్షియల్‌ హబ్‌లో కార్పొరేట్‌ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. యువ నిపుణులు, స్టార్టప్స్‌ హైదరాబాద్‌కు వలస వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ హాట్‌ నగరంగా నిలుస్తుంది. కేపీఎంజీ రిపోర్ట్‌ ప్రకారం.. హైదరాబాద్‌లోకి 793 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇదే అత్యధికం. నిర్మాణ వ్యయం కూడా 25 శాతం మేర పెరిగింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌ చేసిన పెట్టుబడిదారులంతా స్థిరంగా ఉన్నారు.
30 మిలియన్‌ చ.అ. కమర్షియల్‌ స్పేస్‌
గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో 30 మిలియన్‌ చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. 2018 మూడు త్రైమాసికాల్లో కలిపి సుమారు 13 వేల గృహాలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఎక్కువ ఫ్లాట్లు అఫడబుల్, మిడ్‌ సైజ్‌ గృహాలే ఉన్నాయి. 2013–18 మధ్య కాలంలో హైదరాబాద్‌లో ప్రాపర్టీల విక్రయాలు 32 శాతం మేర పెరిగాయి.

Related Posts

Latest News Updates