‘హౌజింగ్ ఫర్ ఆల్–2022’ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీన్ని అక్షరాల ఆచరణీయం చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జనప్రియ ఇంజనీర్స్. సైనిక్‌పురి, అల్వాల్, పటాన్చెరు వంటి పలు ప్రాంతాల్లో అఫడబుల్ హౌజింగ్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో సామాన్యుల సొంతింటి కలను తీర్చడమే లక్ష్యంగా నిర్మాణాలను చేపడుతోంది. పీఎంఏవై కింద రూ.3.5 లక్షల వడ్డీ రాయితీ అందడమే కాకుండా రూ.25 లక్షలకే అపార్ట్‌మెంట్‌ను అందించడమే వీటి ప్రత్యేకత.
మూడున్నర దశాబ్ధాల నిర్మాణ రంగంలో 25 వేలకు పైగా గృహాలను నిర్మించిన ఘనత జనప్రియ సొంతం. ఇదే తరహాలో సైనిక్‌పురిలో అరున్నర ఎకరాల్లో సితార ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 2 వేల అపార్ట్మెంట్లుంటాయి. 580 చ.అ. నుంచి 865 చ.అ. మధ్య 1, 2 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. జాగింగ్ ట్రాక్, ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్, కమ్యూనిటీ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జిమ్, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ వంటి అన్ని రకాల వసతులంటాయి.
కౌకూర్‌లో రూ.30 లక్షలు..
అల్వాల్‌లోని కౌకూర్‌లో 11.67 ఎకరాల్లో అర్కేడియా పేరిట మరొక అఫడబుల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 200 ఫ్లాట్లు. 850 చ.అ. నుంచి 1,250 చ.అ. మధ్య 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షలు. 2020 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుంది. స్విమ్మింగ్ పూల్, జిమ్, ల్యాండ్‌స్కేప్, కమ్యూనిటీ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి వసతులుంటాయి. త్వరలోనే పటాన్చెరు ముత్తంగి. నర్సాపూర్ రోడ్లో సుమారు వెయ్యి గృహాలను నిర్మించనున్నాం. వీటిల్లో ప్రారంభ ధర రూ.20 లక్షలుగా ఉంటుంది.
పూడురులో ఫామ్‌హౌజ్‌లు..
జనప్రియ నుంచి తొలిసారిగా ఫామ్‌హౌజ్ ప్రాజెక్ట్‌లను చేస్తున్నాం. పూడురులో అర్బన్ ఫామ్స్ పేరిట 36 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో ఫామ్ప్లాట్లను విక్రయిస్తున్నాం. కొనుగోలుదారులు వీకెండ్స్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేయడానికీ వీలుగా ఓరియన్ గెస్ట్ హౌజ్ ఉంటుంది. రెండేళ్ల పాటు ప్రాజెక్ట్ మెయింటనెన్స్ కంపెనీయే చేస్తుంది.
జనప్రియ అన్ని ప్రాజెక్ట్‌లకూ వడ్డీ రాయితీ..
సామాన్య, మధ్యతరగతివాసులకు హైదరాబాద్‌లో సొంతిల్లు ఏర్పాటు చేసుకునే విధంగా అందుబాటు గృహాలను నిర్మిస్తున్నాం. జనప్రియలోని అన్ని ప్రాజెక్ట్‌లకు ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రూ.3.5 లక్షల వడ్డీ రాయితీ అందుతుంది.
– రవీందర్ రెడ్డి, చైర్మన్, జనప్రియ