Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రూ.3,900 కోట్ల టారుస్‌ రియల్టీ ఫండ్‌

అమెరికాలోని బూస్టన్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ టారుస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ మన దేశంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ప్రత్యేకంగా రూ.3,900 కోట్లతో రియల్టీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని కమర్షియల్, రిటైల్‌ విభాగంలో రూ.3,250 కోట్లు (500 మిలియన్‌ డాలర్లు), కో–లివింగ్, నివాస విభాగంలో రూ.650 కోట్లు (100 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 5–10 మిలియన్‌ చదరపు అడుగుల్లో కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ఎంబసీ గ్రూప్‌తో చర్చలు చేస్తున్నట్లు తెలిసింది.

Related Posts

Latest News Updates