Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

రూ.400 కోట్ల విలువైన 7 ఎకరాల ఆస్తి జప్తు

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) అధ్యక్షురాలు మాయావతి సోదరుడు ఆనంద్‌కుమార్, ఆయన భార్య విచితర్‌ లతకు చెందిన ఏడు ఎకరాల బినామీ వాణిజ్య స్థలాన్ని ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది. నోయిడా సెక్టార్‌ 94, 2ఏలోని ఈ భూమి విలువ సుమారు రూ.400 కోట్లు ఉంటుంది. అత్యంత ఖరీదైన ఈ భూమిని వారు బినామీ పద్ధతిలో దక్కించుకున్నారని ఐటీ విభాగం కేసు నమోదు చేసింది. ఈ భూమి కొనుగోలు కోసం ఢిల్లీలోని కొందరు హవాలా వ్యాపారుల సహకారం కూడా తీసుకొని వారి ద్వారా అక్రమ మార్గంలో డబ్బు చెల్లింపులు జరిపారన్నది అధికారుల అభియోగం.
6 కంపెనీలు ఆస్తిదారులుగా..
బినామీ ఆస్తి ఉన్న స్థలంలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పాటూ ఇతర లగ్జరీ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. విజన్‌ ప్లానర్స్‌ ప్రై.లి., బీపీటీపీ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌ ప్రై.లి., యురో ఏషియా మర్చంటైల్‌ ప్రై.లి., సన్నీ కాస్ట్‌ అండ్‌ ఫోర్జ్‌ ప్రై.లి., కరిష్మా ఇండస్ట్రీస్‌ ప్రై.లి., యాడ్‌–ఫిన్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రై.లి. ఈ 6 డమ్మీ కంపెనీలు బినామీ ఆస్తిదారులుగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మాయావతి ఇటీవలే బీఎస్‌పీ నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఆనంద్‌ కుమార్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

Related Posts

Latest News Updates