Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

రెంటల్‌ హౌజింగ్‌ పాలసీ ఎలా ఉండాలంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2.ఓ తొలి బడ్జెట్‌ గృహ నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతమున్న రెంటల్‌ పాలసీ సరిగా లేదని, ఆధునిక రెంటల్‌ హౌజింగ్‌ పాలసీని తీసుకొస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
వలసలతో పట్టణీకరణ..
మన దేశంలో రెంటల్‌ హౌజింగ్‌ పాలసీని ఆధునీకరించడం అత్యంత కీలకమైన అంశం. అద్దెదారునికి, యజమానికి మధ్య న్యాయపరమైన అంశాలను సంస్కరించాల్సిన అవసరముంది. ఉద్యోగాల కోసం, కూలీ పనుల కోసం నిత్యం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణాలు, నగరాలకు వలస వస్తున్నారు. దీంతో పట్టణీకరణ వేగవంతంగా వృద్ధి చెందుతుంది. దీంతో పట్టణాలు, నగరాల్లో గృహాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. లేకపోతే నగరాల్లో మురకివాడలు ఏర్పడతాయి. గ్రామాల నుంచి వలస వచ్చిన పేదలు పట్టణాల్లో సొంతిల్లు కొనలేరు. ఒకవేళ కొనుగోలు స్థోమత ఉన్నా.. సొంతూర్లో సొంత ఇల్లు ఉన్న వలసదారులు పట్టణాల్లో సొంతింటి కొనుగోలుకు ఆసక్తి చూపించరు. వలసదారులు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని అద్దె చెల్లించని ఒక స్థాయి అద్దె గృహాలను పెంచాల్సిన అవసరం ఉంది.
సింగపూర్‌లో 80 శాతం పబ్లిక్‌ హౌజింగే..
శాశ్వత అద్దెదారులతో యజమానులు తమ పెట్టుబడిని కోల్పోతామనే భయంతో ఖాళీ ఇళ్లను నిల్వ ఉంచుతున్నారు. వీరి భయాన్ని పోగొట్టి అద్దె గృహాలను ప్రోత్సహించేందుకు రెంటల్‌ పాలసీలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. సింగపూర్‌ జనాభాలో 80 శాతం గృహాలు పబ్లిక్‌ హౌజింగ్‌. హాంకాంగ్‌లో మొత్తం గృహ యాజమాన్యంలో కేవలం 21 శాతం మాత్రమే పబ్లిక్‌ హౌజింగ్‌.
వర్టికల్‌ ఆకారంలో నిర్మాణాలు..
అద్దె గృహాల ప్రోత్సాహంతో నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలతో పాటూ సిమెంట్, ఉక్కు వంటి ఇతర నిర్మాణ సామగ్రి తయారీ కూడా వృద్ధి చెందుతుంది. అద్దె గృహాల నిర్మాణాలను కూడా వర్టికల్‌ ఆకారంలో నిర్మించాలి. ఎందుకంటే తక్కువ స్థలంలో ఎక్కువ గృహాల నిర్మాణంతో పాటూ నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. అలాగే జన సాంద్రత ఎక్కువ ఉన్న ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఫ్లోర్‌ ఏరియా రేషియోను ఎత్తేయాలి. దీంతో వర్టికల్‌ నిర్మాణాలకు అవకాశాలుంటాయి. వీటితో పాటూ రూరల్‌ ల్యాండ్స్‌ను అర్బన్‌ ల్యాండ్స్‌కు మార్చే భూ వినియోగ నిబంధనల సరళీకృతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts

Latest News Updates