Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రెరాలో చేతిలో

స్థిరాస్తి కొనుగోలుదారులకు భరోసా కల్పించడమే తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ప్రధాన లక్ష్యం. రెరాలో నమోదు చేయకుండా విక్రయించే ప్రాజెక్ట్‌లను, ప్రమోటర్లను, ఏజెంట్లను గుర్తించేందుకు అన్ని రకాల అస్త్రాలను వినియోగిస్తోంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏల నుంచి  అనుమతి తీసుకోగానే సమాచారం అందేలా ఏర్పాట్లు చేసిన టీ–రెరా.. తాజాగా రిజిస్ట్రేషన్‌ శాఖ మీద కన్నేసింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా సరే చివరికి రిజిస్ట్రేషన్‌ శాఖ వద్దకు రావాల్సిందే! ఇక్కడే టీ–రెరా వల వేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్‌ వివరాలు టీ–రెరాకు అందుబాటులో ఉండేలా.. సంబంధిత శాఖకు లేఖ రాయనుంది. జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, టీ–రెరా, రిజిస్ట్రేషన్‌ శాఖ.. ఇలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే అనుమతులు, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత వస్తుంది. అంతిమంగా కొనుగోలుదారునికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ, తెలంగాణలో 20 శాతం మంది ప్రమోటర్లు బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుందని, పారదర్శకంగా ఉండాలని రెరాలో నమోదు చేశాకే విక్రయాలు జరుపుతుంటే.. 80 శాతం మంది మాత్రం కొనుగోలుదారులకు మాయమాటలు, రకరకాల ఆఫర్లతో  మోసపూరితంగా అమ్మకాలు చేస్తున్నారని టీ–రెరా పరిశీలనలో తేలింది. ఏ విభాగం నుంచి అనుమతి తీసుకున్నా, ఎవరు ఎవరితో క్రయ విక్రయాలు జరిపినా సరే అంతిమంగా రిజిస్ట్రేషన్‌ శాఖకు రావాల్సిందే కాబట్టి రిజిస్ట్రేషన్‌ శాఖ, టీ–రెరా సమన్వయంగా పనిచేయాలని అధికారులు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌ అయిన ప్రతి డాక్యుమెంట్‌ వివరాలు తెలిసేలా రెండు విభాగాలను అనుసంధానించనున్నారు. ప్రతి డాక్యుమెంట్, ప్రాజెక్ట్‌ను రెరా అధికారులు భౌతికంగా పరిశీలించి, రెరాలో నమోదు అయిందా? లేదా? చెక్‌ చేస్తారు. ఒకవేళ టీ–రెరాలో నమోదు అర్హత ఉండి కూడా రిజిస్టర్‌ కాకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు.సర్వం టీ–రెరా చేతిలో..టీ–రెరా, రిజిస్ట్రేషన్‌ శాఖలు సమన్వంగా పనిచేస్తే.. ప్రమోటర్‌ ఫొటో, ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ వివరాలు, చిరునామా వంటి సమాచారంతో పాటూ భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు, ప్లాటింగ్‌ ఏరియా, ప్రాజెక్ట్‌ వ్యయం, విక్రయ ధర వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. ఇప్పటికే టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రతి ప్రాజెక్ట్, ప్రమోటర్లను గుర్తించేందుకు మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ విభాగాలతో కలిసి పనిచేస్తుమన్నాని టీ–రెరా అధికారులు తెలిపారు. ఆయా విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్‌/ లే అవుట్‌ సమాచారాన్ని తెప్పించుకొని, భౌతికంగా పరిశీలన చేస్తుమన్నాని చెప్పారు. గడువులోగా రెరాలో నమోదు చేసుకుంటే ఓకే! లేకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి.. జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు

Related Posts

Latest News Updates