Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

రెరాలో రీఫండే బెటర్‌!

గృహ కొనుగోలుదారుల్లో రెరా నమ్మకాన్ని పెంచింది. కానీ, డెవలపర్‌ ఇచ్చిన నిర్మాణ గడువు ముగిస్తే మాత్రం వెయిట్‌ చేసేదే లేదు.. కట్టిన సొమ్ము వెనక్కి (రీఫండ్‌) ఇచ్చేయాల్సిందే అంటున్నారు కస్టమర్లు! దేశంలో రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌–2016 చట్టం ప్రారంభమై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ మ్యాజిక్‌బ్రిక్స్‌.కామ్‌ కన్జ్యూమర్‌ పోల్‌ను నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
72 శాతం రెరాకే ఫిర్యాదు..
72 శాతం గృహ కొనుగోలుదారులు నిర్మాణం ఆలస్యం అయితే రెరాకు ఫిర్యాదు చేసేందుకే ఆసక్తి చూపించారు. 19 శాతం మంది మాత్రం రీఫండ్‌ తీసుకోవటానికి మొగ్గు చూపిస్తున్నారు. డెవలపర్‌ ఇచ్చిన గడువు ముగిస్తే మాత్రం.. ప్రతి ఐదుగురిలో ఒకరు రీఫండ్‌ తీసుకోటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే నిర్మాణం పూర్తయ్యే వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో డబ్ల్యూబీహెచ్‌ఐఆర్‌ఏ..
గత రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను, డెవలపర్లను నియంత్రించడంలో రెరా సక్సెస్‌ అయింది. ఫలితంగా రెరా మీద గృహ కొనుగోలుదారులకు నమ్మకం ఏర్పడింది. ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు రెరా నిబంధనలు నోటిఫై అయ్యాయి. ఇందులో 19 రాష్ట్రాల్లో మాత్రం రెరా పోర్టల్స్‌లను కలిగి ఉన్నాయి. ఒక్క పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మాత్రమే సొంత రియల్‌ ఎస్టేట్‌ చట్టాన్ని (డబ్ల్యూబీహెచ్‌ఐఆర్‌ఏ) ఏర్పాటు చేసింది. రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదు, ఫిర్యాదుల పరిష్కారం, అమలు వంటి అంశాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది.
ఆన్‌లైన్‌లో రియల్టీ సమాచారం..
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు సైతం రెరాలో నమోదు చేసుకోవాల్సి ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌లలోనూ పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే నిర్మాణం పూర్తి చేయడంలో ఆసల్యమైన డెవలపర్లు లేదా నిర్మాణ సంస్థల మీద జరిమానాలు, శిక్షలు విధిస్తుంది. గతంలో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లు, అమ్మకాలు, డెవలపర్ల వివరాలు వంటివి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేది కాదు. కానీ, రెరా అమలయ్యాక.. సమస్త రియల్‌ ఎస్టేట్‌ సమాచారం కొనుగోలుదారులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని మ్యాజిక్‌ బ్రిక్స్‌ ఎడిటోరియల్‌ అండ్‌ అడ్వైజరీ హెడ్‌ ఈ జయశ్రీ కురూప్‌ తెలిపారు.

Related Posts

Latest News Updates