Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రెరా ఆన్‌లైన్‌ వేదిక దేశం మొత్తం ఒకటే!

కేంద్ర ప్రభుత్వం రెరా చట్టంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశం మొత్తం ఒకటే రెరా ఆన్‌లైన్‌ వేదికను తీసుకురానుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంత్రాల్లో ఒకటే ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.
రెరా మరింత బలోపేతం..
ఒకటే ఆన్‌లైన్‌ రెరా వేదిక అందుబాటులోకి వచ్చాక ప్రస్తుత రెరా చట్టానికి, ఆన్‌లైన్‌ చట్టానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు. దేశ అంతటా ఒకటే ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తే రియల్‌ ఎస్టేట్‌ చట్టం మరింత బలోపేతంగా తయారవుతుందని పేర్కొన్నారు. రెరా అనేది ఒక నియంత్రణ సంస్థ. ఇది గృహ కొనుగోలుదారులకు బిల్డర్ల మీద ఫిర్యాదు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.
రాష్ట్రాల మధ్య అధ్యయనం, సమన్వయం..
ఒకటే ఆన్‌లైన్‌ వేదిక అందుబాటులో ఉంటే.. ఒక నిర్ధిష్టమైన కేసు లేదా అంశం విషయంలో రాష్ట్రాలు అధ్యయనం చేసుకునే వీలుంటుంది. అలాగే గృహ కొనుగోలుదారులు, డెవలపర్లు సమస్యల మీద వారి వారి అభిప్రాయాలను పంచుకునే వీలుంటుందని తెలిపారు. గృహ కొనుగోలుదారులు, డెవలపర్లు, అథారిటీలు అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంచుకోవటానికి ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.
42 వేల ప్రాజెక్ట్‌ల నమోదు..
రెరా చట్టం–2016 ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గృహ కొనుగోలుదారులకు రక్షణ, భరోసాను కల్పించేందుకు రెరా రెగ్యులేటరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెరాను నోటీఫై చేశాయి. వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రం మాత్రం సొంత రెరా చట్టం హౌజింగ్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌–2017 (హెచ్‌ఐఆర్‌ఏ)ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా రెరాలో 42 వేల ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. 32 వేల మంది ఏజెంట్లు నమోదయ్యారు.
రెరాలో నమోదు కాకపోతే.. వడ్డీ రాయితీ కట్‌
ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై– అర్బన్‌) నిబంధన ప్రకారం రెరా కింద ప్రాజెక్ట్‌ను నమోదు చేయకపోతే గృహ కొనుగోలుదారులకు క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీమ్‌ (సీఎల్‌ఎస్‌ఎస్‌) కింద వడ్డీ రాయితీ రాదు. పీఎంఏవై కింద రూ.2.67 లక్షల వడ్డీ రాయితీని అందిస్తున్న విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates