Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రెవిన్యూ, ఇరిగేషన్‌లో నరకమే

నిర్మాణ అనుమతుల విషయంలో జాప్యం డెవలపర్ల ప్రధాన సమస్య. పర్మిషన్స్‌ ఆలస్యంగా రావటంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. దీని ప్రభావం ధరల మీద ఉంటుంది. అందుకే అనుమతులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్‌వోసీల జారీలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ విభాగాలు పర్వాలేదు. కానీ, రెవిన్యూ, ఇరిగేషన్‌ విభాగాల్లో నరకం కనిపిస్తుంది. నాలా ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. చెల్లించినా సరే ఎన్‌వోసీ జారీ చేసేందుకు 8–12 నెలల సమయం పడుతుంది. అన్ని విభాగాల ఎన్‌వోసీలను 15 రోజుల్లోగా వచ్చేలా సంస్కరణలు చేయాల్సిన అవసరముందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ పి. రామకృష్ణా రావు సూచించారు.
కార్మికులకు ఉచిత శిక్షణ..
నైపుణ్య కార్మికుల కొరత కారణంగా నిర్మాణంలో నాణ్యత దెబ్బతినడంతో పాటూ గడువులోగా ప్రాజెక్ట్‌లు పూర్తి కావట్లేదు. కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే దీనికి సరైన పరిష్కారమని వచ్చే రెండేళ్లలో నగరంలో 250 శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యించారు. వచ్చే పదేళ్లలో దేశంలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికుల అవసరం ఉంది. కార్మికులకు శిక్షణ కోసం నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ), కన్‌స్ట్రక్షన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌డీసీఐ) ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో భాగంగా ప్రాజెక్ట్‌ సైట్లలో కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. ఇది పూర్తిగా ఉచితం. సభ్యుల దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోం. రోజువారీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పని ప్రదేశాల్లోకే ఏజెన్సీలు, నైపుణ్య శిక్షకులు వెళ్లి కార్మికులకు శిక్షణ ఇస్తుంటారు. బ్రిక్, స్టీల్, షటరింగ్‌ వంటి అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తుంటాం.
ట్రీట్‌ చేసిన నీళ్లనే..
ఏటేటా భూగర్భ నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. చెన్నై, బెంగళూరు మాదిరిగా హైదరాబాద్‌లోనూ నీటి కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే నిర్మాణ పనులకు ట్రీట్‌ చేసిన వాటర్‌ను వినియోగించాలని నిర్ణయించాం. ఆ దిశగా క్రెడాయ్‌ సభ్యులను ప్రోత్సహిస్తాం. త్వరలోనే పైలెట్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాం. హరితహారంలో భాగంగా హెచ్‌సీయూలో 200 ఎకరాల్లో లక్ష చెట్లను పెంచాం. మొక్కల పెంపకం, నిర్వహణ కోసం క్రెడాయ్‌ సీఎస్‌ఆర్‌ కింద నెలకు రూ.3 లక్షలు ఖర్చు చేశాం. ఈ ఏడాది వీటిని హెచ్‌సీయూకి అప్పగించనున్నాం.
కొంపల్లి, ఉప్పల్‌ బెటర్‌..
ప్రస్తుతమున్న మౌలిక వసతులు, అభివృద్ధి దృష్ట్యా కొంపల్లి, ఉప్పల్‌ ప్రాంతాలు పెట్టుబడులకు సరైన ప్లేస్‌లు. అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌తో కొంపల్లి ప్రాంతం, మెట్రో, వరంగల్‌ హైవేలతో ఉప్పల్‌ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. పైగా ఆయా ప్రాంతాల్లో స్థలాల లభ్యత, ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. కొత్త ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది గానీ ఆశించిన స్థాయిలో డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ లేదు. వీటిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.

Related Posts

Latest News Updates