నిర్మాణ రంగంలో ఎక్కువ మంది కార్మికులు, వ్యయం అవసరముంటుంది. నిర్మాణ కార్మికుల వ్యయం, శ్రమ తగ్గించేందుకు రోబోలను వినియోగిస్తుంటారు. దీంతో పాటూ నాణ్యత, ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే రియల్టీ పరిశ్రమలో ‘ఎస్ఏఎం’ అని పిలిచే బ్రిక్– లేయింగ్ రోబోట్స్లను వినియోగిస్తున్నారు. వేగంగా, నాణ్యమైన ఇటుకలను అందించడం కోసం దీన్ని వినియోగిస్తున్నారు. వాణిజ్య సముదాయాల నిర్మాణంలో దీన్ని వినియోగిస్తుంటారు. కార్మికులతో పోలిస్తే ఐదు రెట్లు వేగంగా పనిచేస్తుంది.టెక్నాలజీతో కార్మిక శక్తి వృద్ధినిర్మాణ రంగంలో పునాదుల నుంచి భవనం తుది వరకూ అన్ని దశల్లోనూ కార్మికుల స్థానంలో టెక్నాలజీని భర్తీ చేయడం అంత సులువైన విషయం కాదు. సాంకేతికత వినియోగంతో కార్మిక శక్తిని రెట్టింపు చేయడం, సులభతరం చేయడం తేలికవుతుంది. నివాసయోగ్యమైన భవనాలను ఎల్లప్పుడూ భౌతికంగా కార్మిక శక్తి నిర్మాణాలే ఉండాలని కోరుకుంటారు.ప్రమాదాల నివారణకు వీఆర్..నిర్మాణ ప్రమాదాలను, కార్మికుల భద్రత కోసం వర్చువల్/ఆగ్యుమేటెడ్ రియాలిటీని వినియోగిస్తారు. ఈ టెక్నాలజీతో ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు.వీఆర్/ఏఆర్ టెక్ యాప్స్‌లను బీఐఎం సాఫ్ట్వేర్ అనుసంధానం చేయడం ద్వారా నిర్మాణం పూర్తి కాకముందే కాంట్రాక్టర్లు, డెవలపర్లు వర్చువల్ రియలిటీ ద్వారా వాస్తవ నిర్మాణాన్ని చూడవచ్చు. దీంతో పాటూ నిర్మాణ దశలోనూ డిజైన్ల మార్పు చేసుకునే వీలుంటుంది. దీంతో సమయం, వ్యయం రెండూ ఆదా అవుతాయి.డ్రోన్స్‌తో పర్యవేక్షణ..ప్రాజెక్ట్ సైట్లను పర్యవేక్షణ, నిర్వహణ చేయడం కోసం డ్రోన్స్ వినియోగిస్తుంటారు. డ్రోన్స్ టెక్నాలజీ ఖరీదైనప్పటికీ ప్రజాదరణ పొందిన టెక్నాలజీ. డ్రోన్స్ సహాయంతో సైట్ మ్యాప్‌లను 2 డీ, త్రీడీ ఇమేజ్‌లను అభివృద్ధి చేయవచ్చు కూడా. ఆధునిక డ్రోన్స్‌తో సైట్ కొలతల్లో సమన్వయంతో పాటూ ఖచ్చితత్వం ఉంటుంది.